Anushka Shetty
ఎంటర్‌టైన్మెంట్

Anushka Shetty: ఖాళీ టైమ్‌లో స్వీటీ అనుష్క ఏం చేస్తుందో తెలుసా?

Anushka Shetty: స్వీటీ అనుష్క‌ను చూసేందుకు ఆమె అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న వారందరి కోసం ఈ సెప్టెంబర్ 5న ‘ఘాటి’ (Ghaati) అనే యాక్షన్ డ్రామాతో అనుష్క థియేటర్లలోకి రాబోతోంది. విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహించిన ఈ సినిమా UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్ర విశేషాలను స్వీటీ అనుష్క మీడియాకు చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ..

మహిళలో ఉండే గొప్ప లక్షణమది

‘‘నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20వ సంవత్సరమిది. ఇలాంటి సందర్భంలో ‘ఘాటి’ వంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేసినందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఇందులో చేసిన శీలావతి అమేజింగ్ క్యారెక్టర్. ఇలాంటి పాత్రని నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. కంఫర్ట్ జోన్‌ని బీట్ చేసి చేసిన సినిమా ఇది. ‘అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి..’ ఈ సినిమాలన్నింటిలోనూ నేను చాలా బలమైన పాత్రలు చేశాను. ‘ఘాటి’లో చేసిన శీలావతి పాత్ర కూడా అంతే బలంగా ఉంటూనే.. ఒక డిఫరెంట్ షేడ్‌తో ఉంటుంది. ప్రతి మహిళ సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ ఏదైనా టఫ్ సందర్భం వస్తే.. ఒక బలమైన పిల్లర్‌లా నిలబడతారు. మహిళలో ఉండే గొప్ప లక్షణమది. క్రిష్ అలాంటి ఒక బలమైన పాత్రని ఇందులో తీర్చిదిద్దారు. క్రిష్, రచయిత శ్రీనివాస్ ఈ కథ చెప్పినప్పుడు ఆ కల్చర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. లొకేషన్స్‌కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్, కల్చర్, ఒక కొత్త విజువల్‌ని ఆడియన్స్‌కి చూపించబోతున్నామనే ఎక్జయిట్‌మెంట్ కలిగింది.

Also Read- Sobhita Dhulipala: శోభిత ధూళిపాల మళ్లీ వార్తల్లోకి.. ఈసారి ఏం చేసిందంటే?

నా ఫిల్మోగ్రఫీలో నిలిచిపోయే పాత్ర

వేదం తర్వాత క్రిష్, నేను కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో నాకు తెలుసు. ‘వేదం’లో సరోజ పాత్రకి కొనసాగింపుగా ఒక సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. కానీ ఆర్గానిక్‌గా ఏదైనా ఒక కథ వస్తే బాగుంటుందని ఇద్దరం ఎదురు చూశాం. అలాంటి సమయంలో ఈ కథ కుదిరింది. క్రిష్ నాకు ఎప్పుడూ కూడా చాలా అద్భుతమైన పాత్రలు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయనకి కృతజ్ఞతలు. ఇందులో శీలావతి పాత్ర నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. నేను చేసిన చాలా వరకు సినిమాలు హార్డ్ వర్క్‌తో కూడుకున్నవే. ‘ఘాటి’లో కూడా ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది. అయితే ఇలాంటి కొత్త లొకేషన్స్‌లో షూట్ చేయడం మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను. క్రిష్ షూటింగ్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. అలాంటి కొత్త లొకేషన్స్ షూట్ చేయడం మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్.

రాజమౌళి వంటి దర్శకుల వల్లే

ఈ సినిమాను ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌లో షూట్ చేసే సమయంలో.. నన్ను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. రాజమౌళి (SS Rajamouli) వంటి దర్శకులు బాహుబలి (Baahubali) లాంటి చిత్రాలతో అద్భుతంగా నన్ను ప్రజెంట్ చేయడం వలనే అన్ని వైపులా రీచ్ వచ్చింది. ఒక మంచి చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుందనేదానికి ఇదే ఉదాహరణ. ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నాను. అరుంధతి నుంచి ఇప్పటివరకు నాకు ఎన్నో అద్భుతమైన పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Also Read- Mark Movie: ఇది కిచ్చా సుదీప్ ‘మార్క్’ రా.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

ఖాళీ దొరికితే చేసేది అదే..

నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండను. బయట కూడా పెద్దగా కనిపించను. ఖాళీ దొరికితే చాలు ఎక్కువగా ట్రావెట్ చేస్తాను. బుక్స్ చదువుతాను. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను. ఇంకా ఎక్కువగా టైమ్ దొరికితే మూవీస్ చూస్తాను. గత రెండేళ్లుగా నేను ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. నాకు అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ రోల్ చేయాలని ఉంది. ఒక బలమైన పాత్ర కుదిరితే కచ్చితంగా నెగిటివ్ రోల్ చేస్తాను. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నాను. మంచి లైన్ అప్ ఉంది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాను. ఇదే నా ఫస్ట్ మలయాళం ఫిల్మ్. తెలుగులో త్వరలోనే ఓ కొత్త సినిమా ప్రకటన ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం