Sobhita Dhulipala: నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) వైవాహిక జీవితానికి బ్రేక్ పడిన అనంతరం.. శోభిత ధూళిపాల పేరు బాగా వినిపించింది. అప్పటి వరకు ఆమె ఎన్ని సినిమాలు చేసినా, అంతగా వినిపించని ఆ పేరు ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయిందంటే కారణం నాగ చైతన్యతో రెండో పెళ్లికి సిద్ధపడటమే. మరి సమంత ఉన్నప్పుడే వారి మధ్య ప్రేమ బంధం ఉందా? లేదంటే సమంతతో విడాకుల అనంతరం చైతూ లైఫ్‌లోకి శోభిత వచ్చిందా? అనేది పక్కన పెడితే.. వారి ప్రేమను పెళ్లిగా మార్చుకున్న తీరుకు మాత్రం వారిద్దరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైందని, అతి త్వరలోనే ఆమెకు కూడా రెండో పెళ్లి ఘడియ రానుందనేలా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలా ఓ త్రికోణ ప్రేమకథగా చైతూ, శోభిత, సమంతల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. తాజాగా శోభిత మరోసారి వార్తలలో బాగా హైలెట్ అవుతోంది. ఎందుకంటే..
Also Read- Strange incident: కన్నె పిల్లనని మస్కా కొట్టిన 52 ఏళ్ల మహిళ.. నిజం తెలిసి లేపేసిన 26 ఏళ్ల కుర్రాడు!
వంట చేస్తూ మెప్పించిన తెలుగమ్మాయ్..
శోభిత ధూళిపాల (Sobhita Dhulipala) తెలుగమ్మాయనే విషయం తెలియంది కాదు. తెలుగమ్మాయిలకు మ్యాగ్జిమమ్ వంటపై అవగాహన ఉంటుంది. శోభిత కూడా ఇప్పుడు విలేజ్‌లో ఉండే కుక్ అవతార్‌లో వంట చేస్తున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే, అప్పటి నుంచి ఆమె పేరు వార్తలలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫొటోలలో బెండకాయలు కట్ చేస్తూ, సాంబార్ ప్రిపేర్ చేస్తూ.. కనిపించింది. దీనికి బేసిక్ హ్యూమన్ స్కిల్స్ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో నెటిజన్లు పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతకు ముందు చైతూ భార్య ఎప్పుడూ ఇలా కనిపించలేదని, మొత్తానికి మన తెలుగమ్మాయి అని నిరూపించావంటూ నెటిజన్లు శోభితపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read- Ileana: మళ్లీ నటిగా మీ ముందుకు వస్తా.. కాకపోతే..? రీ ఎంట్రీపై ఇలియానా కామెంట్స్
టేస్ట్ చూడడానికి వెయిటింగ్
శోభిత చేసిన ఈ పోస్ట్‌కు ఆమె భర్త, యువసామ్రాట్ నాగ చైతన్య కూడా రియాక్ట్ అవడం విశేషం. నాగ చైతన్యకు ప్రస్తుతం షోయు (Shoyu), స్కూజీ (Scuzi) అనే రెండు క్లౌడ్ కిచెన్ వెంచర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన భార్య ఇలా వంట చేయడం చూసిన తర్వాత చైతూకు ఎలాంటి థాట్స్ వస్తాయో అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక శోభిత చేసిన పోస్ట్‌కు నాగ చైతన్య రియాక్ట్ అవుతూ.. ‘నువ్వు చేసిన వంటను రుచి చూడడానికి వెయిట్ చేస్తున్నాను’ అని కామెంట్ చేశారు. అలాగే ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు కూడా శోభిత ఆన్సర్ ఇచ్చారు. ‘మీకు వంట చేయడం వచ్చా అక్కా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నాకు మూడ్ ఉన్నప్పుడే చేస్తా చెల్లి’ అంటూ శోభిత సమాధానం ఇచ్చింది. మొత్తంగా అయితే శోభిత తన వంటతో అందరి అటెన్షన్‌ను పొందేసిందని, ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా షూటింగ్‌లోనే..
శోభిత ఇలా వంట చేసింది ఇంట్లో కాదండోయ్.. ప్రస్తుతం తను చేస్తున్న ఓ సినిమా సెట్‌లో అని తెలుస్తోంది. ‘సెట్ లైఫ్’ అంటూ ప్రత్యేకంగా ఆమె జోడించిన క్యాప్షన్ చూస్తుంటే.. షూటింగ్ లొకేషన్‌లో ఆమె వంట చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ‘భైరవం’ సినిమా టీమ్ కూడా ఇలా వంట చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు శోభిత కూడా అలానే ట్రీట్ ఇచ్చేసింది. అయితే, ఆమె ఏ సినిమా షూటింగ్‌లో ఇలా వంట చేసిందనే విషయం మాత్రం తెలియలేదు. ఆమె చేస్తున్న కర్రీస్‌ను బట్టి.. ఇది కచ్చితంగా తెలుగు సినిమానే అని మాత్రం చెప్పొచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు