GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ విలీనం ప్రక్రియ
GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ విలీనం.. 27 స్థానిక సంస్థల్లో జీహెచ్ఎంసీ బోర్డులు ఏర్పాటు!

GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీ(GHMC)లో విలీనం చేసే ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదంతో ప్రారంభమైన ఈ విలీన ప్రక్రియకు సంబంధించి ఈ నెల 3న సర్కారు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) ప్రత్యేక ప్రోసీడింగ్ జారీ చేస్తూ, ఆయా స్థానిక సంస్థల్లోని రికార్డులను స్వాధీనం చేసుకునేందుకు ఒక్కో స్థానిక సంస్థకు ఒక డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌ను, పర్యవేక్షణకు జోనల్ కమిషనర్లను నియమించారు. ఈ నెల 4న ఉదయం వరకు రికార్డులన్నీ అధికారికంగా స్వాధీనం చేసుకున్న జీహెచ్ఎంసీ, వెంటనే ఆయా కార్యాలయాల పేర్లను తొలగించి, జీహెచ్ఎంసీ పరిధిలోకి విలీనమైనట్లు బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ విధంగా, భౌగోళికంగా ఈ పట్టణ స్థానిక సంస్థల విలీనం కంప్లీట్ అయింది.

వార్డుల పునర్విభజన

రికార్డుల స్వాధీన ప్రక్రియలో భాగంగా అధికారులు స్థానిక సంస్థల నిధులను జీహెచ్ఎంసీ(GHMC) ఎస్‌బీఐ(SBI) బ్యాంక్ ఖాతాకు బదలాయించారు. అయితే, అత్యధిక సంఖ్యలో స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భౌగోళిక విలీనం పూర్తి చేస్తూనే, జీహెచ్ఎంసీ పరిధిలోని 150 మున్సిపల్ వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా అధికారులు మొదలుపెట్టినట్లు, ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలిసింది. రికార్డుల స్వాధీనానికి కమిషనర్ విధించిన గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియనున్నప్పటికీ, అంతకు ముందే విలీన ప్రక్రియను పూర్తి చేశారు.

Also Read: Indigo flight Cancellations: ఇవాళ ఒక్కరోజే 700 విమానాలు రద్దు.. రంగంలోకి కేంద్రం.. కీలక నిబంధన ఉపసంహరణ

ఆన్‌లైన్ సేవలపై ప్రత్యేక ఫోకస్

ముఖ్యంగా విలీన స్థానిక సంస్థల్లోని శానిటేషన్‌(Sanitation)పై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రికార్డుల స్వాధీనం ముగిసిన వెంటనే, బల్దియా తరహాలో శానిటేషన్‌పై దృష్టి సారించి, ఉదయం ఆరు గంటల కల్లా సిబ్బంది విధుల్లో ఉండేలా చూడాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం శానిటేషన్ పనులను పర్యవేక్షించిన 27 మంది ఇంజనీర్లను గుర్తించి, వారిని శానిటేషన్ స్పెషలాఫీసర్లుగా నియమించే ప్రక్రియను హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం చేపట్టింది. త్వరలోనే వీరికి అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

అన్నీ ఆన్‌లైన్ పరిధిలోకే..

దీనికి తోడు, విలీనమైన 27 స్థానిక సంస్థల్లో నిన్నమొన్నటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్(Property tax) వసూళ్లు మ్యానువల్‌గా జరిగేవి. కానీ, వాటన్నింటినీ జీహెచ్ఎంసీ మాదిరిగానే ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురావాలని కమిషనర్ కర్ణన్ ఐటీ వింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో పాటు, బర్త్(Birth), డెత్(Derth) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను కూడా జీహెచ్ఎంసీ పోర్టల్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. స్ట్రీట్ లైట్లు, రోడ్ల నిర్వహణ, ప్రాజెక్టులు, కనీస వసతులపై కూడా జీహెచ్ఎంసీ మెరుగుపర్చేలా కసరత్తు చేస్తోంది.

Also Read: Cyber Crime: విదేశీ ఉద్యోగాల పేర సైబర్ మొసాలు.. వరంగల్లో 5గురు ఏజెంట్లు అరెస్ట్!

Just In

01

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్