Cyber Crime: విదేశీ ఉద్యోగాల పేర సైబర్ మొసాలు
Cyber Crime (imagecredit:twitter)
Telangana News, నార్త్ తెలంగాణ

Cyber Crime: విదేశీ ఉద్యోగాల పేర సైబర్ మొసాలు.. వరంగల్లో 5గురు ఏజెంట్లు అరెస్ట్!

Cyber Crime: విదేశీ ఉద్యోగాల పేర యువకులను దేశం దాటిస్తూ సైబర్ క్రిమినల్స్ గ్యాంగులకు అప్పగిస్తున్న 5గురు ఏజెంట్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వరంగల్(Warangal) జిల్లాకు చెంది కుత్బుల్లాపూర్ లో ఉంటున్న గోవర్ధన్ (35), వరంగల్ రూరల్ జిల్లా గోరుగుట్ట తాండాకు చెందిన బానోతు మదన్ లాల్ (26), మైసూర్ కు చెందిన సయ్యద్ మొహమ్మద్ మదానీ (26), కృష్ణా జిల్లా గన్నవరం నివాసి సుధీర్ కుమార్ (26), ఉప్పల్ కు చెందిన నవీన్ (26)ల మధ్య పరిచయం ఉంది.

గోవర్ధన్ యుగ పేరుతో కన్సల్టెన్సీ..

గోవర్ధన్ యుగ పేరుతో కన్సల్టెన్సీని నడుపుతున్నాడు. అతని స్నేహితులు మదన్ లాల్, సుధీర్. గోవర్ధన్ ఈ ఇద్దరిని డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ పై మయన్మార్ పంపాడు. అక్కడ ఇద్దరు సైబర్ నేరాలు చేస్తున్న చైనా దేశానికి చెందిన వారి చేతుల్లో చిక్కుకుని హెచ్ఎస్(HS) అనే కంపెనీలో పని చేశారు. అప్పుడే వీరికి రిక్రూటింగ్ ఏజెంట్ గా పని చేస్తున్న మొహమ్మద్ మదానీతో పరిచయం అయ్యింది. ఇక, హెచ్ఎస్ కంపెనీ ఒక్కో అభ్యర్థిని రిక్రూట్ చేస్తే 3వేల నుంచి 5వేల డాలర్లు కమీషన్ ఇస్తామని చెప్పటంతో మదన్ లాల్ విషయాన్ని గోవర్ధన్ తో చెప్పాడు. అప్పటి నుంచి గోవర్ధన్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ అభ్యర్థులను ఆకర్షించడం మొదలుపెట్టాడు. వరంగల్‌లో ఆఫీసు కూడా తెరిచాడు. చరణ్ మరియు షేక్ అహ్మద్ పాషా అనే వ్యక్తులు అతన్ని సంప్రదించగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘లవ్ కె’ అనే వ్యక్తితో ఇంటర్వ్యూ ఇప్పించాడు. ఎంపికైన తర్వాత వారిద్దరి వద్ద నుండి రూ. 25,000 వసూలు చేశాడు. బ్యాంకాక్ చేరుకున్నాక, వారిని టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేసి, టాక్సీ ద్వారా మయన్మార్‌లోని మయావాడిలో ఉన్న కె.కె4 ప్రాంతానికి తరలించారు.

Also Read: Cyber Criminals: బస్తీమే సవాల్ అంటున్న సైబర్ క్రిమినల్స్.. సైబరాబాద్, రాచకొండ వెబ్‌సైట్ల హ్యాక్!

బాధితులు డబ్బు కట్టలేక..

ఇక, నవీన్ ఇలాగే ప్రకటన ఇచ్చి మరో యువకున్ని 2లక్షలు తీసుకొని మరీ మయన్మార్ పంపించాడు. ఇలా విదేశీ ఉద్యోగం మోజులో దేశంగాని దేశం చేరిన బాధితులు సైబర్ క్రిమినల్స్ గ్యాంగుల చేతుల్లో చిక్కుకొని ఇష్టం లేకున్నా సైబర్ మోసాలు చేస్తూ వచ్చారు. కొందరు ఈ పని చేయలేము, తిరిగి వెళ్లిపోతామంటే సైబర్ గ్యాంగుల బాసులు 5000 డాలర్లు కట్టమని డిమాండ్ చేశారు. దాంతో బాధితులు డబ్బు కట్టలేక బలవంతంగా అక్కడే పని చేయాల్సి వచ్చింది. కాగా, వీళ్లలో కొందరు తాము పడుతున్న బాధలను కుటుంబ సభ్యులకు తెలిపారు. విషయం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వెళ్లటంతో అధికారులు ఇటీవల 500మందిని చెర విడిపించి స్వదేశానికి చేర్చారు. వీరిలో ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో డీఎస్పీలు కే.వీ.ఎం.ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సీఐలు లక్ష్మీనారాయణ, దత్తాద్రి, ఎస్ఐలు రాము నాయక్, శ్రవణ్ కుమార్ లతో కలిసి విచారణ చేసి 5గురిని అరెస్ట్ చేశారు.

Also Read: Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తుడి తలపగలగొట్టిన వ్యాపారి

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు