R.V. Karnan: కుటుంబ పోషణ భారం..చాలీ చాలని జీతం కోసం అర్థరాత్రి సైతం ప్రాణాలను ఫణంగా పెట్టి పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ( GHMC) శానిటేషన్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కమిషనర్ ఆర్.వి. కర్ణన్(R.V. Karnan)సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్(*Hyderabad) నగరంలో జీవించే అన్ని వర్గాల ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో రాకపోకలు సాగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎంతో అంకితాభావంతో విధులు నిర్వహిస్తున్నారని, వారులేకుండా సిటీలో జనం అనే వారుండరన్న అభిప్రాయానికి వచ్చిన కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులకు వీలైనంత మేరకు చేయూతనిచ్చేందుకు సిద్దమయ్యారు.
Also Read: Rajasthan: ఆడుకుంటూ గన్‌తో కాల్చుకున్న 5 ఏళ్ల బాలుడు.. తలలోకి బుల్లెట్
సుమారు కోటిన్నర మంది జనాభా ఉన్న హైదరాబాద్(Hyderabad) సిటీ 650 కిలోమీటర్ల విస్తీర్ణం, సుమారు పదివేల కిలోమీటర్ల పొడువున రోడ్లను శుభ్రపరిచేందుకు కేవలం 25 వేల మంది కార్మికులు నిరంతరం విధులు నిర్వహిస్తుంటారు. ఔట్ సోర్స్ ప్రాతిపాదికన విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల పేరిట అంత్యక్రియలకు చెల్లించే రూ. 10 వేల స్థానంలో కమిషనర్ ఎంతో మానవత్వంతో స్పందించి, నిమజ్జనంలో ప్రమాదవశాత్తు టస్కర్ కింద పడి చనిపోయిన రేణుక కుటుంబానికి ఏకంగా రూ. లక్ష ఇచ్చి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తన ఉదార స్వభాన్ని చాటుకున్నారు.
ఇన్సూరెన్స్ రూ 30 లక్షలకు వర్తించేలా అమలు
అంతటితో ఆగని కమిషనర్ శానిటేషన్ కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్న ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా గణనీయంగా పెంచేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతమున్న నిబంధన ప్రకారం ప్రమాదాల బారిన పడి శానిటేషన్ కార్మికులు మృతి చెందితే ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ. 8 లక్షల ఎక్స్ గ్రేషియా, రూ. 2 లక్షలు మేయర్ ఫండ్ నుంచి పరిహారంగా చెల్లిస్తున్నారు. కానీ ఈ పాతకాలపు విధానంలో మార్పు తెచ్చి, ప్రస్తుతం అమలవుతున్న ఇన్సూరెన్స్ రూ 30 లక్షలకు వర్తించేలా అమలు చేయాలని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు త్వరలో జరిగే స్టాండింగ్ కమిటీలో ప్రతిపాద కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సైతం సంప్రదించినట్లు. అందుకు మేయర్ సైతం అంగీకరించటంతో స్టాండింగ్ కమిటీ సమావేశంలో దీనిపై కిలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ ఒక్క నిర్ణయం గ్రేటర్ పరిధిలో శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న 25 వేల మందికి ఆసరా, భరోసాగా మారనుంది.
Also Read: All India Prison Duty Meet 2025: తెలంగాణలో ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్.. ఎప్పుడంటే..?