All India Prison Duty Meet 2025: 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ ఈసారి తెలంగాణలో జరుగనుంది. ఈనెల 9న ప్రారంభమై మూడు రోజులపాటు జరుగనున్న డ్యూటీ మీట్ కోసం జైళ్ల శాఖ అధికారులు రావు బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా(DG Soumya Mishra) ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రెండోసారి…
2015లో మొదటిసారి ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్(All India Prison Duty Meet) నిర్వహించిన తెలంగాణ ఈ ఈవెంట్ ను రెండోసారి జరుపనుంది. ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ లో 21 రాష్ట్రాల నుంచి జైళ్ల శాఖ సిబ్బంది పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్ ఘడ్, గోవా, గోజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిషా, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ తోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, చండీఘడ్ నుంచి మొత్తం 13వందల మంది రానున్నారు. వీరిలో 184మంది మహిళా సిబ్బంది ఉన్నారు.
Also Read: The Bengal Files Controversy: ప్రభుత్వంపై దర్శకుడు ఫైర్.. చట్టపరమైన చర్యలకు సిద్ధం.. ఎందుకంటే?
36 ఈవెమట్లు
ఇక, డ్యూటీ మీట్ లో ఆయా రాష్ట్రాల జైళ్ల శాక సిబ్బంది మొత్తం 36 ఈవెంట్లలో వీళ్లు పోటీ పడనున్నారు. ఫస్ట్ ఎయిడ్(First aid), సంక్షేమ పథకాలు(Welfare schemes), బిజినెస్ మోడల్స్(Business Models), క్విజ్, మెడకల్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ లో వీరికి పోటీ నిర్వహించనున్నారు. దీంతోపాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, కరాటే, క్రవంగా, అథ్లెటిక్స్, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్ తదితర విభాగాల్లో కూడా పోటీలు జరుగనున్నాయి.
విజేతగా…
2022లో గుజరాత్ రాష్ట్రం అహమదాబాద్ లో జరిగిన 6వ ఆలిండియా ప్రిజన డ్యూటీ మీట్ లో తెలంగాణ(Telangana) ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించి రాష్ట్రానికి పేరు తీసుకొచ్చింది. ఈసారి కూడా రాష్ట్ర జైళ్ల శాఖ సిబ్బంది ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధిస్తారన్న ఆశాభావాన్ని డీజీ సౌమ్యా మిశ్రా వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై జైళ్ల శాఖ ఐజీలు రాజేశ్, మురళీబాబు, డీఐజీలు శ్రీనివాస్, సంపత్, సంతోష్ కుమార్ రాయ్. సూపరిండింటెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్ తదితరులతో సమీక్షా సమావేశాన్ని జరిపారు. ఈవెంట్ ముగింపు రోజున బడా ఖానా (గ్రాండ్ డిన్నర్) జరపాలని నిర్ణయించారు. ఇక, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్ శాఖ డ్యూటీ మీట్ లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనుంది. వీటిలో హస్త కళా ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ దుస్తులను డిస్కౌంట్ రేట్లకు అందుబాటులో పెట్టనున్నారు. దీంతోపాటు పర్యాటక శాఖ కూడా స్టాల్ ఏర్పాటు చేయనుంది. పాల్గొంటున్న అభ్యర్థుల కోసం ఒకటిన్నర రోజు వస్తువులను కొనటానికి టూర్ ఏర్పాటు చేయనుంది.
Also Read: Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?