Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు. వెలుగులోకి?
Viral Fevers( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

Viral Fevers: జిల్లాలో ఉన్న కేజీబీవీలలో విష జ్వరాలు(Viral Fevers) విజృంభిస్తున్నాయి. వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పులు అపరిశుభ్ర వాతావ‌ర‌ణం వెర‌సి రోగాలు ముసురుతుంటాయి. వీటికి తోడు మలేరియా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూలు కూడా త‌మ ప్రతాపాన్ని చూపిస్తుండ‌టంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతి కేజిబీవిలో విద్యార్థినుల సంఖ్యను బట్టి వైద్య సిబ్బంది నియమించాలి. ప్రతి కేజీబీవీకి ఒకరే ఏఎన్ఎం నియమించడంతో వైద్యులు లేకపోవడంతో విద్యార్థినులకు వైద్యం‌ కరువైంది. కేజీబీవీలో విద్యార్థినులు వైరల్ ఫీవర్ బాధపడుతుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తున ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.

 Also Read: Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

కేజీబీవిలో సుమారు 20‌ మంది

జిల్లాలో ఉన్న కేజీబీవీలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో ఓ కేజీబీవీలో విద్యార్థినీలకు విష‌ జ్వరాలు రాగ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. గురుకులాలలో వైద్య సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులకు వైద్యం కరువైందని విద్యార్థినీల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాజాగా అయిజ మండలంలోని కేజీబీవిలో సుమారు 20‌ మందికి విషజ్వరాల బారిన పడటంతో సమీపంలోని పీహెచ్సీలో వైద్యం అందిస్తున్నట్లు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేజీబీవీలో ప్రతి విద్యార్థినికి వైద్యం కోసం వైద్య సిబ్బందిని కేటాయించినా నామ్ కే వాస్తే డ్యూటీలు చేయడంతో విద్యార్థినీల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినీలతో పాటు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థినీలు డెంగ్యూ,మలేరియా

గద్వాల సమీపంలోని గోనుపాడు కేజీవీబీలో కొందరు విద్యార్థులు జ్వరంతో బాధపడుతుండగా చికిత్స చేయించిన అనంతరం ఇంటికి పంపుతున్నాం అని అంటున్నారు. కేజీబీవీ పక్కనే నీరు నిల్వ ఉండి జమ్ము ఏర్పడడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని, ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, అధికారులు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినీలు కోరుతున్నారు. విద్యార్థినీలు డెంగ్యూ,మలేరియా వంటి జ్వరాలతో బాధపడుతున్నారన్న సమాచారంతో కేజీబీవీ ఎస్ఓలను వివరణ కోరగా వాతావరణ మార్పల వల్ల కొందరు విద్యార్థినిలకు జ్వరం వస్తోందని చెబుతున్నారు. ఎక్కువ అనారోగ్య సమస్యతో ఉన్న వారిని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అప్పగిస్తున్నామని, మరి కొందరు స్థానికంగా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామన్నారు.

వాతావరణ మార్పు వల్ల విద్యార్థినిలు జలుబు గొంతు నొప్పి వారే జ్వరాల బారిన పడుతున్నారు. రెగ్యులర్ డాక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతో మా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ప్రతి వసతి గృహాలలో చదివే విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్యులను నియమించి నిరంతరం వసతి గృహాలలో విద్యార్థినీల ఆరోగ్య స్థితిని తెలుసుకొని సకాలంలో వైద్యం చేయాలని కోరుతున్నారు.

 Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..