Toddy Shops( IMAGE CREDIT: TWITTER)
హైదరాబాద్

Toddy Shops: కల్లు కాంపౌండ్లపై స్పెషల్​ డ్రైవ్.. పక్కాగా వివరాలు సేకరించేందుకు ప్లాన్

Toddy Shops: కూకట్‌పల్లిలో విషాదం సృష్టించిన కల్తీ కల్లు ఉదంతం నేపథ్యంలో వారం రోజులపాటు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్​ షానవాజ్ ఖాసీంఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ స్టేట్, డిస్ట్రిక్ టాస్క్​ ఫోర్స్, ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందాలు అన్ని కల్లు కాంపౌండ్లపై దాడులు జరుపనున్నాయి. ఆయా కంపౌండ్ల నుంచి శాంపిళ్లు సేకరిస్తాయి.

Also Read: Muralidhar Rao: ఏసీబీ అదుపులో మాజీ ఈఎన్సీ.. అవినీతి చరిత్ర పెద్దదే!

కల్లును ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు?

కల్తీ జరిగిందా? లేదా? అన్నది నిర్ధారించుకోవడానికి నారాయణగూడలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి వాటిని పంపిస్తాయి. కల్తీ జరిగిందని తెలిస్తే కల్లు కాంపౌండ్లను సీజ్ చేస్తారు. వాటి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆయా సొసైటీల పరిధిలో నడుస్తున్న కల్లు కాంపౌండ్లు ఎన్ని? కల్లును ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? ఎక్కడెక్కడ అమ్మకాలు జరుపుతున్నారు? అన్న వివరాలను పక్కాగా సేకరిస్తారు. అనుమతులు లేకుండా నడుస్తున్న కల్లు కాంపౌండ్లను సీజ్ చేసి నిర్వాహకులను అరెస్ట్ చేస్తారు. ఇక, కల్లు దందాలోని సిండికేట్​ వ్యవస్థ గురించిన సమాచారాన్ని కూడా సేకరిస్తారు. సోమవారం నుంచి మొదలైన ఈ స్పెషల్ డ్రైవ్ వారంపాటు కొనసాగనున్నది.

Also Read: Revanth – Chandrababu: ఢిల్లీకి రావాలని కేంద్ర జలశక్తిశాఖ సర్క్యూలర్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!