Revanth - Chandrababu( IMAGE credit: twitter)
తెలంగాణ

Revanth – Chandrababu: ఢిల్లీకి రావాలని కేంద్ర జలశక్తిశాఖ సర్క్యూలర్

Revanth – Chandrababu: తెలంగాణ సీఎం (Revanth Reddy) రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) భేటీకి కేంద్రం తేదీని ఫిక్స్ చేసింది. ఈ నెల 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ , (CR Paatil) నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన సర్క్యూలర్‌ను  కేంద్రజలశక్తి శాఖ విడుదల చేసింది. జల వివాదంపై చర్చించనున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. అదే విధంగా కృష్ణా, గోదావరి జల వివాదాలను సైతం చర్చించి సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇద్దరు సీఎంలకు వీలవుతుందో లేదో తెలపాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు  ఢిల్లీకి వెళ్తున్నారు. ముందే కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నట్లు తెలిసింది.

Also ReadMLC Kavitha: కవిత కయ్యాలపై కీలక భేటీ.. జాగృతిపైనే ప్రధానంగా చర్చ!

నీటి వాటాలపై తగ్గేదే లేదు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం భేటీకి హాజరై తెలంగాణ నీటి వాటాపై గట్టిగా గళం వినిపించనున్నట్లు సమాచారం. బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని సమావేశంలో వివరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

 Also Read: Shubman Gill: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మాన్ గిల్‌

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ