GHMC Commissioner: దుర్గం చెరువు (Durgam Cheruvu) దుర్గంధ భరితంగా మారిందని ఈ నెల 17న ‘దుర్గంధ చెరువు’ పేరుతో స్వేచ్ఛ కథనాన్ని ప్రచురించింది. వాకింగ్ ట్రాక్‌పై నడవలేని పరిస్థితి ఉందని, ముక్కు పుటాలు పగులేలా దుర్గంధం వస్తున్నదని ఎక్స్ వేదికగా ప్రజల స్పందనను వివరించింది. ఇదే క్రమంలో జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ (RV Karnan)దుర్గం చెరువును పరిశీలించారు. డ్రైనేజీ సమస్యను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఉదయం కమిషనర్, జోనల్ కమిషనర్ జలమండలి, సీఈ, ఎస్ఎన్డీపీ ఈఈ, లేక్స్ అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మురుగు నీటి పైప్ లైన్ సరిగ్గా, క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పైప్ లైన్ మళ్లింపు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సీవరేజ్ లైన్ స్వతహాగా నిర్వహించి వాకర్స్‌కు ఇబ్బందులు లేకుండా జలమండలి చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: GHMC: బంజారాహిల్స్‌లో.. కుప్పలుకుప్పలుగా చెత్త!
నీటిని పరీక్షించాలి
చెరువును మరింత సుందరంగా పెంపొందించడానికి పార్కులో వస్తువులను సమీకరించాలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి సూచించారు. అక్కడ ఉన్న ఎస్టీపీని సందర్శించి మురుగు నీటిని శుద్ధి చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. థర్డ్ పార్టీతో పాటు నీరీ సంస్థ ద్వారా శుద్ధి చేసిన నీటిని పరీక్షించాలని జలమండలి (Water Board) అధికారులను ఆదేశించారు. ఎస్ఎన్డీపీ ద్వారా చేపడతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులను పరిశీలించి సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
చర్యలు తీసుకోవాలి
ఈ విషయంలో జోనల్ కమిషనర్ వారానికోసారి ప్రగతిని సమీక్షించి ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగించి నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్‌తో పాటు శేరిలింగంపల్లి (Serilingampally) జోనల్ కమీషనర్ సహదేవ్ కేశవ్ పాటిల్, ఎస్ఎన్డీపీ సీఈ కోటేశ్వరరావు, జలమండలి (Water Board) అధికారులు, లేక్స్ ఈఈ నారాయణ, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Uttar Pradesh News: ప్రియుడి కోసం వెళ్లిన భార్య.. వెంటాడి ముక్కు కొరికేసిన భర్త.. ఎక్కడంటే?