Uttar Pradesh News (Image Source: Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Uttar Pradesh News: ప్రియుడి కోసం వెళ్లిన భార్య.. వెంటాడి ముక్కు కొరికేసిన భర్త.. ఎక్కడంటే?

Uttar Pradesh News: వివాహేతర సంబంధాలు.. పచ్చని కాపురాల్లో చిచ్చులుపెడుతున్నాయి. జీవిత భాగస్వామిని విలన్లుగా మారుస్తున్నాయి. కలకలం కలిసి జీవించాల్సిన భార్య భర్తలను హంతకులుగా మార్చేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. ప్రియుడితో భార్య సన్నిహితంగా ఉండటాన్ని చూసిన ఓ భర్త.. తట్టుకోలేకపోయాడు. కోపాన్ని అణుచుకోలేక ఆవేశంలో ఆమె ముక్కు కొరికేశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌ హర్దోయ్ జిల్లాలోని ఓ గ్రామంలో రామ్ ఖిలావన్  (Ram Khilawan) తన భార్య (25)తో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో రామ్ ఖిలావన్ భార్య మరో వ్యక్తితో వివాహేతర బందాన్ని పెట్టుకుంది. ఇది గమనించిన భర్త.. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి ఈ విధంగా చేస్తే ఊరుకోనని మందలించాడు. అయినప్పటికీ ఖిలావన్ భార్యలో మార్పు రాలేదు. రహస్యంగా ప్రియుడ్ని కలుస్తూనే వచ్చింది.

రెడ్ హ్యాండెడ్ గా
ఈ క్రమంలోనే ఎప్పటిలాగే బుధవారం (జూన్ 18న) ప్రియుడ్ని కలిసేందుకు రామ్ ఖిలావన్ భార్య రహస్యంగా వెళ్లింది. దీంతో భార్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు ఆమెనే ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ సందర్భంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ముక్కు కొరికేసిన భర్త
భార్య భర్తల మధ్య మాటామాటా పెరగడంతో రామ్ ఖిలావత్ సహనం కోల్పోయాడు. ఒక్కసారిగా ఆమె ముక్కును గట్టిగా కొరికివేశాడు. ఆమె కేకలు విన్న స్థానికులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన మహిళను హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు.

Also Read: SpiceJet flight: హైదరాబాద్ – తిరుపతి విమానంలో సాంకేతిక సమస్య.. ఫ్లైట్‌లో 80 మంది ప్రయాణికులు!

పోలీసుల అదుపులో భర్త
అయితే బాధితురాలి ముక్కు అయిన గాయం తీవ్రంగా ఉండటంతో వారు మెరుగైన చికిత్స కోసం లక్నోలోని వైద్య కేంద్రానికి తరలించారు. ఈ కేసులో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్ తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Also Read This: Honeymoon Murder Case: హనీమూన్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. అందరి అంచనాలు తలకిందులు!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు