SpiceJet flight: హైదరాబాద్ - తిరుపతి విమానంలో సాంకేతిక సమస్య
SpiceJet flight (Image Source: Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

SpiceJet flight: హైదరాబాద్ – తిరుపతి విమానంలో సాంకేతిక సమస్య.. ఫ్లైట్‌లో 80 మంది ప్రయాణికులు!

SpiceJet flight: విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్‌ (Hyderabad) నుంచి తిరుపతి (Tirupati) వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం (SpiceJet flight)లో సాంకేతిక సమస్య ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో సమస్య వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు.

గాల్లో ఉండగా సాంకేతిక సమస్య
స్పైస్‌జెట్‌కు (Spicejet) చెందిన విమానం గురువారం ఉదయం శంషాబాద్ విమానశ్రయం నుంచి తిరుపతికి బయలుదేరింది. టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్యను సిబ్బంది గమనించారు. అప్రమత్తమైన పైలట్‌ ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో అధికారులు విమానాశ్రయంలో దించేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్‌.. సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఇతర విమానాల్లో తిరుపతికి పంపించేందుకు విమానయాన సంస్థకు చెందిన అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read: Honeymoon Murder Case: హనీమూన్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. అందరి అంచనాలు తలకిందులు!

3 రోజుల క్రితం కూడా..
శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో స్పైస్ జెట్ విమానంలో తరచుగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండడం ప్రయాణికుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నెల16న హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ 2138 నంబర్ విమానంలో కాలిన వాసన రావడంతో ఫ్లైట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. టేకాఫ్ ముందే విమానాన్ని ఎయిర్‌ పోర్టులో నిలిపివేసి తనిఖీలు చేశారు. అయితే బయలుదేరే క్షణంలో విమానాన్ని నిలిపివేయడంతో ప్రయాణికులు మూడున్నర గంటలపాటు ఇబ్బందులు పడ్డారు.

Also Read This: Air India Crash Survivor: మృత్యుంజయుడికి కొండంత కష్టం.. వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో వైరల్!

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..