Cybercriminals: సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను సమకూర్చి, అక్రమ లావాదేవీలకు సహకరించిన తొమ్మిది మందిని (Cyberabad Cyber Crime Police)సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 82,500 నగదు, 16 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల (Police) వివరాల ప్రకారం.. విదేశాల్లో ఉంటూ తన గ్యాంగ్ ద్వారా భారతదేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న జాక్ అనే వ్యక్తి, మోసాల ద్వారా సంపాదించిన డబ్బును తరలించడానికి స్థానికుల బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకున్నాడు.
Also Read: BJP Telangana: పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
జాక్ తన ముఠా సభ్యులు
తాను చెప్పినట్లు చేస్తే కమీషన్ రూపంలో భారీ మొత్తాలు ఇస్తానని ఆశ చూపాడు. ఈ ఆశతో రాజస్థాన్‌కు చెందిన సుమిత్ రాథోడ్, మన్వేంద్ర సింగ్తో పాటు తెలంగాణకు చెందిన మహ్మద్ నదీమ్ ఉర్ రెహమాన్, మహ్మద్ షఫీ, ఎస్. భరత్, తెలుగు మహేశ్, అబ్దుల్ ఖాలెద్, జే. మహేశ్ జాక్‌తో చేతులు కలిపారు. వీరందరినీ గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ ప్రాంతంలో ఉన్న వేర్వేరు హోటళ్లకు జాక్ తన ముఠా సభ్యుల ద్వారా పిలిపించుకున్నాడు. అక్కడ వారి ఫోన్‌లలో ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయించాడు. దీంతో ఆయా ఫోన్లు వెంటనే జాక్ నియంత్రణలోకి వెళ్ళాయి. సైబర్ మోసాల ద్వారా కొల్లగొట్టిన డబ్బును ఈ ఖాతాలలో జమ చేయించిన జాక్, ఆ తర్వాత తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఇటీవల నమోదైన ఒక సైబర్ క్రైమ్ కేసులో విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు జరిపి, జాక్‌కు ఖాతాలు సమకూర్చిన ఈ తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
Also Read: Rahul Gandhi: తెలంగాణ దేశానికే మైలు రాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలు