Rahul Gandhi: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశానికి ఒక మైలురాయి వంటిదని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభివర్ణించారు. కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి, (Revanth Reddy) ఆయన బృందం తన అంచనాలకు మించి పని చేసిందని రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, కుల గణన అంతతేలికైన అంశం కాదని, తెలంగాణలో కుల గణనకు ప్రోత్సహించినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి,(Revanth Reddy)కి ఈ అంశం కష్టమని భావించానన్నారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గం కూడా సర్వేకు అంగీకరించకపోయి ఉండవచ్చుననుకున్నానని రాహుల్ వివరించారు.
Also Read: Mallikarjuna Kharge: తెలంగాణలో కులగణన దేశానికి దిశానిర్దేశం!
కానీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) మనస్ఫూర్తిగా, సమర్థంగా సర్వే చేశారని తెలిపారు. తెలంగాణలో తలుపులు మూసిన పరిపాలన గదుల నుంచి కుల గణన చేయలేదని, అన్ని సామాజికి వర్గాలకు చెందిన లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఈ సర్వేలో పాల్గొనేందుకు తలుపులు తెరిచారన్నారు.1950,1960, 1970 దశకాల్లో అధికారం, శక్తి ఎక్కడి నుంచి వస్తుందని ప్రపంచ దేశాలను ప్రశ్నిస్తే, ఆయిల్ అనే సమాధానం వచ్చేదని రాహుల్ గాంధీ వివరించారు. ఈ కాలం ఆధిపత్యం, అధికారం, శక్తి డాటా (సమాచారం) అని చెబుతారని, అలాంటి 21 వ శతాబ్ధానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉందని రాహుల్ గాంధీ తెలిపారు.
ఈ డాటాతో గ్రామీణ, జిల్లా స్థాయిల్లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్యం.. ఇలా ఏరంగాల్లోనైనా అభివృద్ధి ఫలాలు అందించవచ్చునన్నారు. ఇలాంటి లక్ష్యిత అభివృద్ధి అందించే అవకావం దేశంలో తెలంగాణకు తప్ప మరే రాష్ట్రానికి లేదని సగర్వంగా చెబుతున్నానని రాహుల్ (Rahul Gandhi) అన్నారు. ప్రజలకు మేలు చేసే ఈ సర్వేను బీజేపీ వ్యతిరేకిస్తుందని, ఆ పార్టీ విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంగ్లిష్ విద్యతోనే దేశాభివృద్ధి
ఇక, దేశాభివృద్ధికి డబ్బు, భూమలు కాదని, ఇంగ్లిష్ విద్యనే మార్గమని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైందన్నారు. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని తాను అనుకునేవాడినని, కానీ, ఇంగ్లిష్ ప్రాధాన్యమైన అంశంపై కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంగ్లిష్ అవసరం ఉన్నా హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని తాను చెప్పడం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారని, వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం ఇంగ్లిష్ మీడియం అనే సమాధానమే వస్తుందన్నారు.
ప్రజల జీవితాల్లో మార్పు
మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనకబడినవర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు ఇవ్వరని బీజేపీ నేతలను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కుల గణన, ఓబీసీలకు రిజర్వేషన్లు తనకు, సీఎం రేవంత్ రెడ్డికి జాబ్ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ డేటాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని తాము నిరతంతరం ఆలోచిస్తుంటే, తెలంగాణలో సాగుతున్న ఆలోచనలను అడ్డుకోవాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ల గోడను బద్దలు కొడుతూ కేంద్రానికి పంపిన బిల్లులను బీజేపీ అడ్డుకుంటున్నదని రాహుల్ అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్ వేదికగా పోరాడడమే ప్రస్తుతం మన ముందున్న లక్ష్యమని ఎంపీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు.
Also Read: CM Revanth Reddy: కులగణన రోల్ మోడలే కాదు..రేర్ మోడల్ దీని అర్థం త్వరలోనే చెబుతా!