Hyderabad Operation ROPE (imagecredit:swetcha)
హైదరాబాద్

Hyderabad Operation ROPE: ట్రాన్స్​జెండర్ల పని తీరు భేష్.. సీపీ ఆనంద్

Hyderabad Operation ROPE: నగరంలో వాహనాల సగటు వేగం పెరిగిందని కమిషనర్​ సీ.వీ.ఆనంద్(CV Anand) చెప్పారు. ట్రాఫిక్​ పోలీసుల కృషి వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. గతంలో సగటు వేగం 17 నుంచి 18 కిలోమీటర్ల ఉండేదని చెబుతూ ప్రస్తుతం ఇది 24 నుంచి 25 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. హైదరాబాద్​ట్రాఫిక్​ పరిస్థితిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఆపరేషన్ రోప్ (Operation ROPE) ​మంచి ఫలితాలనిస్తోందన్నారు. దీనిని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. వీఐపీల రాకపోకలపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. స్వయంగా సీఎం తన ప్రయాణ సమయాల్లో ఎక్కువ సేపు ట్రాఫిక్‌ను నిలపవద్దని ఆదేశాలు ఇచ్చారని చెబుతూ దానికి అనుగుణంగా పని చేస్తున్నామని తెలిపారు.

గూగుల్​కంపెనీ సహాయం

ఇక హైదరాబాద్​లో 80శాతం సిగ్నల్లు ఆటో మోడ్​లో పని చేస్తున్నాయన్నారు. దీని వల్ల ట్రాఫిక్​ త్వరంగా క్లియర్ అవుతూందన్నారు. జరిమానాల విధింపులో సంఖ్యకు కాకుండా నాణ్యతకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్​ను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ట్రాఫిక్​ వ్యవస్థను మరింత మెరుగు పరచటానికి గూగుల్​కంపెనీ సహాయం తీసుకుంటున్నట్టు చెప్పారు. గూగుల్​మ్యాప్స్(GoogleMapsSupport) ​తో పాటు ఆ సంస్థ సిబ్బంది సాంకేతికంగా సహకరిస్తున్నారన్నారు. ఇక, నగరంలోని బహుళ అంతస్తుల భవనాల యజమానుల సహకారంతో హై రేస్​కెమెరాలను ఏర్పాటు చేసి ఈగల్​వ్యూ సేకరిస్తున్నామన్నారు. దీని ద్వారా అధికారులు ముందస్తుగా ట్రాఫిక్​ సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బందిని అప్రమత్తం చేయటంతోపాటు పరిష్కార మార్గాలను సూచిస్తున్నారన్నారు.

Also Read: CM Revanth Reddy: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌ 2 మంజూరు చేయండి!

ట్రాఫిక్​ మార్షల్స్ వ్యవస్థ

సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్​మార్షల్​వ్యవస్థను ప్రవేశ పెట్టనున్నట్టు కమిషనర్ చెప్పారు. కార్పోరేట్​సంస్థలు సామాజిక బాధ్యతగా మార్షల్స్ ను నియమించుకోవాలని సూచించారు. వీరికి తాము శిక్షణ ఇచ్చి ట్రాఫిక్​ నియంత్రణ కోసం ఉపయోగిస్తామని తెలిపారు.

ట్రాన్స్​జెండర్లు భేష్

ఇక, ట్రాఫిక్ పోలీసు విభాగంలో పని చేస్తున్న ట్రాన్స్​జెండర్లు(Trans genders In Traffic) విధులను చక్కగా నిర్వర్తిస్తున్నారన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. ముందు ముందు ట్రాఫిక్ విభాగంలో మరింత మంది ట్రాన్స్​జెండర్లను నియమించటానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర శాఖలలో కూడా వీరిని నియమించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

వర్షాకాలం నేపథ్యంలో

వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. హైడ్రా(Hydra), జీహెచ్ఎంసీ(GHMC) తోపాటు ఇతర శాఖలతో సమన్వయం కుదుర్చుకుని పని చేస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్​ట్రావెల్స్​బస్సుల వల్ల సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. ఆయా ట్రావెల్స్​యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి వీటి పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్​జాయింట్​సీపీ జోయల్​డేవిస్, డీసీపీలు రాహుల్​హెడ్గే, అశోక్​కుమార్, వెంకటేశ్వర్లు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.

Also Read: Nagabandham: అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో 5000 మందితో..

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు