Jubilee hills Constituency: జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ(Congree Party) సర్వే చేస్తున్నది. 3.87 లక్షల ఓటర్లున్న నియోజకవర్గంలో అభ్యర్ధి ఎంపిక కోసం స్టడీ చేస్తున్నది. ఏఐసీసీ(AICC) ఆధ్వర్యంలోని టీమ్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఫీల్టర్ చేస్తున్నాయి. గత వారమే హైదరాబాద్(Hyderanad) కు వచ్చిన టీమ్స్ జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీపై పబ్లిక్ ఫల్స్ ఎలా ఉన్నాయి? అభ్యర్ధి వారీగా ఏ మేరకు మైలేజ్ ఉన్నది? ఎవరిని రంగంలోకి దించితే బాగుంటుంది? ఎంఐఎం(MIM) మద్ధతుతో అభ్యర్ధిని నిలబెడితే ఎలా ఉంటుంది? ఎంఐంఎ పొత్తు లేకుండా క్యాండిడేట్ రేసులో ఉంటే రిజల్ట్ ఎలా ఉంటాయి? ఏ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి? వాళ్లు కాంగ్రెస్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనే తదితర అంశాలపై ఏఐసీసీ టీమ్స్(AICC TIms) సర్వే చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే ప్రాథమిక రిపోర్టును ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కు, ఏఐసీసీ కార్యాలయం ఢిల్లీ(Delhi) అగ్రనేతలకు ఇచ్చినట్లు తెలిసింది. మరో దఫా కూడా సర్వే నిర్వహించే ఛాన్స్ ఉన్నదని ఏఐసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ ఏఐసీసీ సర్వేల ఆధారంగానే క్యాండిడేట్లకు టిక్కెట్లు, ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయని ఆయన వివరించారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని ఆయన నొక్కి చెప్పారు.
మైనార్టీ, యాదవ్స్ వైపే మొగ్గు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మైనార్టీ, యాదవ్(Yadav) సామాజిక వర్గం నుంచే కాంగ్రెస్(Congress) అభ్యర్ధిని కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే మైనార్టీ నుంచి గెలిస్తే మంత్రి పదవి వరించడం అనివార్యంగా మారనున్నది. దీంతో మైనార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గతంలో పోటీ చేసిన అజహారుద్దీన్‌తో పాటు బాబా ఫసియోద్దీన్, కార్పొరేషన్ చైర్మన్ ఫయిం ఖురేషీ లు ట్రై చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో అజారుద్దీన్(Azharuddin) కు 64,212 ఓట్లు లభించాయి. దీంతో ఈ ఉప ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ లభిస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. టిక్కెట్ తనకే అంటూ ఇటీవల స్వయంగా ఆయనే ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు.
Also Read: Indiramma Houses: లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్.. మంత్రి వెల్లడి!
ఇక యాదవ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్(Naveen Yadav) కూడా రేసులో ఉన్నారు. ఎన్నికల కంటే ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ దఫా టిక్కెట్ పై ఆయన ధీమాతో ఉన్నారు. 2014లో ఎంఐఎం(MIM) నుంచి పోటీ చేసి 41,656 ఓట్లను సాధించగా, 2018లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన 18,817 ఓట్లను సాధించారు. హైదరాబాద్ లో యాదవ సామాజిక వర్గానికి ప్రతినిధ్యం కల్పించాలని పార్టీ భావిస్తే నవీన్ యాదవ్ కు టిక్కెట్ వరించే ఛాన్స్ ఉన్నది. హైకమాండ్ ఆశీస్సులు లభిస్తే ప్రమోషన్ కూడా ఉండే ఛాన్స్ ఎక్కువే.
ఆశావహుల్లో మరి కొందరు?
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్(Bonthu Rammohan) కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు పీజేఆర్ కూతురు విజయారెడ్డి(Vijaya Reddy), ఖైరతాబాద్ డీసీసీ, సీఎం రేవంత్(CM Revanth) సన్నిహితుడు రోహిన్ రెడ్డిలు కూడా తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్ గా పనిచేసిన అనుభవంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బొంతు భావిస్తున్నారు. ఇక పీజేఆర్(PJR) చరిష్మా, లాంగ్ టర్మ్ లో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం, టిక్కెట్ రాకపోయినా, గ్రేటర్ ప్రజలతో మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తున్నాననే ధీమాతో ఆమె టిక్కట్ ఆశీస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోహిన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ద్వారా మరోసారి టెస్టుకు రెడీ అవుతున్నారు. సీఎం సన్నిహితుడు కావడం తనకు కలసి వస్తాయనే ఆలోచనలో ఆయన ఉన్నారు.
ఎంఐఎం మద్ధతిస్తే ఈజీ?
ఉప ఎన్నికల్లో ఎంఐఎం(MIM) కాంగ్రెస్(Congress) కు మద్ధతుగా నిలిస్తే గెలుపు ఈజీగా మారే ఛాన్స్ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు తర్వాత ఎంఐఎం(MIM) కాంగ్రెస్ తో ప్రెండ్లీ రిలేషన్ మెయింటెన్ చేస్తున్నది.జీహెచ్ ఎంసీ(GHMC) లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎంకు మద్ధతు ఇచ్చింది. కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఎంఐఎంకు ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్టు చేస్తుందనే ఆలోచనతో నేతలు ఉన్నారు. మద్ధతు కోసం ఇప్పటికే సీనియర్లు ఎంఐఎంతో చర్చలుకూడా జరుపుతున్నట్లు తెలిసింది. ఒక వేళ ఎంఐంఎ సపోర్టు చేయకపోతే కాంగ్రెస్ చతుర్ముఖ పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒంటరిగా కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తోనే గట్టెక్కాల్సి ఉంటుంది.
Also Read: Shubhanshu Shukla: సర్వం సిద్ధం.. ట్విస్టులు ఉంటాయా?