Women Bhavan (imagecredit:swetcha)
హైదరాబాద్

Women Bhavan: గుడ్ న్యూస్.. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం..?

Women Bhavan: బంజారాహిల్స్ మున్సిపల్ డివిజన్ లోని ఎన్ బీ టీ(NBT) నగర్ లోని మహిళ భవన్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్(Multi-purpose function hall) ను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభిస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) తెలిపారు. బంజారాహిల్స్ డివిజన్ లోనీ ఎన్ బీ టీ నగర్ మహిళ భవన్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి మేయర్ పెండింగ్ పనులు పరిశీలించారు. మహిళ భవన్, ఫంక్షన్ హాల్, రోడ్డుపెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మేయర్ సూచించారు.

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

వారి చేతుల మీదుగా..

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకున్నారని మేయర్ వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆత్మ గౌరవంతో నిలబడేలా సీఎం రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. వారి చేతుల మీదుగా ఎన్ బీ టీ నగర్ మహిళ భవన్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం కానుండడం సంతోషకరమన్నారు. అంతకుముందు మేయర్ బంజారాహిల్స్ లోనీ తన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం కింద 17 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. సీఎం సహాయక నిధి నుంచి నలుగురు లబ్ధిదారులకు రూ లక్ష 94 వేలు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక లబ్ధిదారుడికి రూ.2.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read: Rain Alert: వర్షాలపై అలర్ట్.. హెల్ప్‌లైన్ నంబర్ విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టరేట్

Just In

01

Pawan Kalyan OG: ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

Shocking Video: అమెరికాలో ఘోరం.. వాషింగ్ మిషన్ కోసం.. భారతీయుడి తల నరికి హత్య

Bandi Sanjay: సైబర్ దాడుల ముప్పు సమిష్టిగా ఎదుర్కొందాం: బండి సంజయ్

Vishnu Manchu: తమ్ముడు మనోజ్ సినిమాకి మంచు విష్ణు ట్వీట్

Jurala Project: జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం.. 9 గేట్లు ఎత్తివేత!