Jubilee Hills Bypoll (image Credit: twitter)
హైదరాబాద్

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Jubilee Hills Bypoll: సిటీలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ 5వ తేదీ కల్లా వచ్చే అవకాశమున్నట్లు జీహెచ్ఎంసీ( GHMC) అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే సర్కారు ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి, పలు అభివృద్ది పనులు చేపట్టగా, మరో వైపు జిల్లా ఎన్నికల అధికారి, యంత్రాంగం కూడా ఎన్నికల దిశగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కానీ అక్టోబర్ 5వ తేదీ కల్లా భారత ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గం ఉప ఎన్నికకు(Jubilee Hills Bypoll) నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.

 Also Read: K-Ramp Movie Song: ‘కె ర్యాంప్’ సినిమా నుంచి లిరికల్ వచ్చేసింది.. వారి కెమిస్ట్రీ కుదిరిందిగా..

ఓటరు జాబితాను రూపకల్పన

జిల్లా ఎన్నికల అధికారి, యంత్రాంగం ఇప్పటికే జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గానికి తప్పుల్లేని చక్కటి ఓటరు జాబితాను రూపకల్పన చేసే పనిలో నిమగ్నమైంది. ఈ నెల 2వ తేదీన జారీ చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 139 లొకేషన్ లు, 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా 3 లక్షల 92 వేల 669 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 17 వరకు గడువునివ్వటంతో ఈ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది.

ఈ నెల 30వ తేదీన బీహార్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితా

ఈ జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్లు, అలాగే తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ ముసాయిదాపై ఈ నెల 17 వరకు అభ్యంతరాలను స్వీకరించి, ఈ నెలాఖరు కల్లా వాటిని పరిష్కరించి ఈ నెల 30వ తేదీన నియోజకవర్గం ఓటరు తుది జాబితాను ప్రచురిస్తామని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన బీహార్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించే అవకాశమున్నందున, ఆ తర్వాత వచ్చే నెల మొదటి వారం 5వ తేదీలోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమచారం.

పూర్తయిన ఈవీఎంల టెస్టింగ్

హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)ల టెస్టింగ్ కూడా గోషామహాల్ లోని ఈవీఎం గోదాంలో పూర్తయినట్లు సమాచారం. మొత్తం 487 ఈవీఎంలను టెస్టు చేసి, 50 ఈవీఎంలలో డమ్మీ బ్యాలెట్ తో మాక్ పోలింగ్ ప్రక్రియను కూడా నిర్వహించిన జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అవసరమైన సంఖ్యలో ఈవీఎంలను సిద్దం చేసింది. ఇటీవలే జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకున్న వివిధ రకాల పనుల నిమిత్తం వివిధ విభాగాలకు చెందిన జీహెచ్ఎంసీ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ ఈ ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుని సిద్దంగా ఉన్నట్లు, ఇక నోటిఫికేషన్ రావటమే ఆలస్యమంటూ పలువురు అధికారులు వ్యాఖ్యానించారు.

 Also Read: Double Whorls: తలలో రెండు సుడులు ఉంటే నిజంగానే రెండు పెళ్లిళ్లు అవుతాయా.. దీనిలో వాస్తవమెంత?

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్