Ganja Cultivation: కిస్మత్ పూర్‌లో గంజాయి మొక్కల కలకలం
నిర్మానుష ప్రాంతంలో గంజాయి మొక్కల పెంపకం
నిందిత వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
రాజేంద్రనగర్/స్వేచ్ఛ: పోలీసు అధికారులు ఎన్ని పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. ఏదో ఒక దొంగదారిలో డ్రగ్స్ రవాణా చేస్తూనే ఉన్నారు. మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తే పట్టుబడతానన్న భయమో ఏమోగానీ, ఓ వ్యక్తి నేరుగా ఇక్కడ ఇక్కడే గంజాయి మొక్కల పెంపకం (Ganja Cultivation) మొదలుపెట్టాడు. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో షాకింగ్ ఘటన బయటపడింది. గంజాయి మొక్కల పెంపకం తీవ్రం కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కిస్మత్‌పూర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన రాజేందర్ అనే వ్యక్తి గత నాలుగైదు నెలలుగా గంజాయి సాగు చేస్తూ, చుట్టుపక్కల ఉండే యువకులకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న పక్కా సమాచారంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also- Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రాజేంద్రనగర్/స్వేచ్ఛ: గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో కొకైన్ ఉందని విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్‌వోటీ పోలీసులు రైడ్ చేసి శ్రీనివాస్, విజయ్‌లను పట్టుకున్నారు. శ్రీనివాస్ (46) రాజమండ్రికి చెందిన వ్యక్తిగా, విజయ్ గోవాకు చెందినవాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి వద్ద నుంచి 7 గ్రాముల కొకైన్ డ్రగ్‌తో పాటు 2 సెల్ ఫోన్లు సీజ్ చేసి నార్సింగి పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్‌ను హాస్పిటల్‌కు తరలించి టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే ఈ డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుందో, ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరే ఉన్నారా?, మరెవరైనా? ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారా? దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Also- TG Police Reforms: ఇక రాచకొండ కమిషనరేట్ క్లోజ్.. వ్యవస్థలో భారీ మార్పులు

