Medchal News : మేడ్చల్ మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి బొమ్మరాసిపేట గ్రామంలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
Also Read: Medchal News: నివాస గృహాల మధ్య స్టీల్ కంపెనీ.. ప్రజలకు నరకం
సీసీ కెమెరాల్లో రికార్డు
ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దుండగుల కదలికలు రికార్డు అయినట్లు సమాచారం.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన శామీర్‌పేట పోలీసులు, దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also Read: Medchal News: గంజాయి పుష్పాలు చిక్కారు.. పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం..

