Medchal News: నివాస గృహాల మధ్య స్టీల్ కంపెనీ.. ప్రజలకు నరకం
Medchal News (imagecredit:swetcha)
హైదరాబాద్

Medchal News: నివాస గృహాల మధ్య స్టీల్ కంపెనీ.. ప్రజలకు నరకం

Medchal News: నివాస గృహాల మధ్య అక్రమంగా నెలకొల్సిన స్టీల్ మెకానికల్ కంపెనీతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఈ కంపెనీ మూలంగా ఏర్పడుతున్న శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒకరిని అడిగితే మరొకరు పేరు చెపుతూ దాట వేస్తున్నారు తప్పా చర్యలు తీసుకోవడం లేదు. జీహెచ్ఎంసీ(GHMC) కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పైపులైన్ రోడ్డులో ఈ పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే కుత్బుల్లాపూర్(Qutubullahpur) సర్కిల్ పరిధిలోని పైపులైన్ రోడ్డులో మిత్ర హోమ్స్, యమున, గంగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ మూడు ఆపార్ట్మెంట్స్లో వేలాది మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ నివాస గృహాల మధ్య ఇటీవల స్టీల్ మెకానికల్ కంపెనీ(Steel Mechanical Company)ని ప్రారంభించారు.

రాత్రిపూట నిద్ర పోలేక
ఆక్రమంగా ఏర్పాటు చేసిన కంపెనీ కారణంగా ప్రజలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. 24 గంటల పాటు నడిచే కంపెనీలో జరిగే కార్యకలాపాలతో పెద్ద ఎత్తు శబ్దం(Sound) వస్తుంది. ఈ శబ్దంతో ప్రజలు రాత్రిపూట నిద్ర పోలేకపోతున్నారు. విద్యార్థులకు చదువుకు ఆటంకం కల్గుతుంది. భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్(Traffic) సమస్యలు తలెత్తుతున్నాయి. తమ నివాస గృహాల నుంచి బయటకు వచ్చేందుకు, బయట నుంచి లోపలికి వెళ్లడానికి ట్రాఫిక్ సమస్య తలెత్తి. తీవ్ర ఇబ్బండి పడుతున్నారు. వాహనాలను ఎక్కడ పడితే పార్కింగ్ చేయడంతో రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంపెనీ కార్యకలాపాల వల్ల దుమ్ము దూళితో పాటు వెలువడుతున్న వ్యర్థాలు ప్రజా ఆరోగ్యం పాలిట శాపంగా మారాయి.

Also Read: Health: ఎందుకైనా మంచిది.. అరుదైన ఈ క్యాన్సర్‌ గురించి తెలుసుకోండి!

12 రోజులైనా పట్టించుకోవడం లేదు
ప్రజలు ప్రశాంతంగా జీవించే చోట ఇలాంటి కంపెనీకి అనుమతులు ఎలా ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే కంపెనీని ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిహెచ్ఎంసీ(GHMC) డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసిన 12 రోజులైనా పట్టించుకోవడం లేదని మిత్ర హోమ్స్ గృహ సముదాయం అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్(Ramesh) తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి, ప్రజా ఆరోగ్యానికి ఇబ్బందికరంగా కంపెనీని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ విషయమై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వివరణ కోరగా మరో అధికారిని అడగాలని సూచిస్తున్నారు. ఆయనేమో స్పందించడం లేదు. ఈ వ్యవహరం చూస్తుంటే అధికారులు అవినీతి లేదా రాజకీయ జోక్యమైన ఉండాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే పోరాటం అపబోమని వారు స్పష్టం చేస్తున్నారు.

Also Read: KTR: బీసీ డిక్లరేషన్ అడుగడుగునా మోసమే.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?