KTR (Image Source: Twitter)
తెలంగాణ

KTR: బీసీ డిక్లరేషన్ అడుగడుగునా మోసమే.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

KTR: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల నుంచి మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలకు మోసపూరిత వైఖరినే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కుల గణన నుంచి ప్రారంభించి, ప్రస్తుత ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిల్లోనూ బీసీలను మోసం చేయడమే అసలైన లక్ష్యంగా ఉందని విమర్శించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బీసీ ప్రజాప్రతినిధులతో మంగళవారం కేటీఆర్ చర్చించారు.

Also Read: Sub-inspector Stolen 2 cr: బాధితుల సొమ్ముతో లేచిపోయిన పోలీసు జంట.. రూ.2 కోట్లతో గోవా, మనాలీలో షికార్లు.. చివరికి!

ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కేవలం బీసీలను మోసం చేయాలన్న దురుద్దేశంతోనే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశంలో, ప్రతి సందర్భంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు. తాము తీసుకువచ్చిన చట్టం ఆమోదం పొందదని తెలిసినా, మరోసారి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని పేర్కొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందన్నారు.

Also Read This: Swetcha Effect: స్వేచ్ఛ ప్రత్యేక కథనంతో.. ఎట్టకేలకు ఆస్పత్రి వైద్య సేవలకు మోక్షం..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!