Medha School (imagecredit:swetcha)
హైదరాబాద్

Medha School: అల్ఫాజోలం కేసులో బోయినపల్లిలోని స్కూల్​ సీజ్​ చేసిన అధికారులు

Medha School: ఆల్ఫాజోలెం కేసులో బోయిన్​ పల్లి కంటోన్మెంట్ ప్రాంతంలోని స్కూల్​ ను అధికారులు సీజ్​ చేశారు. దీనికి సంబంధించిన అన్ని అనుమతులను విద్యా శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్​ నగర్(Mahabub Nagar) జిల్లాకు చెందిన జయప్రకాశ్ గౌడ్​ ఓల్డ్​ బోయిన్​ పల్లి సాయిరాం కాలనీ నివాసి. కంటోన్మెంట్ ప్రాంతంలో మేధా పేరుతో స్కూల్​ నడుపుతున్నాడు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 130మంది పిల్లలు చదువుకుంటున్నారు.

అనుమానం రాదని స్కూల్లో..

కాగా, తేలికగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో జయప్రకాశ్ గౌడ్​ కల్తీ కల్లు(Adulterated toffee) తయారీలో ఉపయోగించే ఆల్ఫాజోలెంను తయారు చేసి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురవారెడ్డి అనే వ్యక్తి నుంచి ఫార్మూలాను తీసుకున్నాడు. అనంతరం ఎవ్వరికీ అనుమానం రాదని స్కూల్లోని గదుల్లో రియాక్టర్లు, డ్రయ్యర్లు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో కెమికల్స్ కొంటూ ఆల్ఫాజోలెం తయారు చేయటం మొదలు పెట్టాడు. సోమవారం నుంచి శనివారం వరకు ఆల్ఫాజోలెం తయారు చేసి ఆదివారాల్లో దానిని భూత్పూర్ మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కల్లు డిపోల నిర్వాహకులకు అమ్ముతున్నాడు.

Also Read: GST 2.0: చిరు తిండ్లు తినేవారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇక మీ పంట పండినట్లే!

ఈగల్ టీం అధికారులు..

ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన ఈగల్ టీం(Eagle Team) అధికారులు శనివారం టాస్క్​ ఫోర్స్​ పోలీసులతో కలిసి స్కూల్ పై దాడి జరిపారు. రియాక్టర్లు, డ్రయ్యర్లతోపాటు పెద్ద మొత్తంలో కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాశ్ గౌడ్(Jayaprakash Goud)​ నుంచి 20 లక్షల నగదును కూడా సీజ్​ చేసి ఉదయ్ సాయి, మురళి అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యా శాఖ స్కూల్ కు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది.

Also Read: Janagama District: రేషన్ షాపుల్లో వినియోగ‌దారుల అరిగోసలు.. ఉరుకులు పరుగులతో జనాలు..?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!