GST 2.0 (Image Source: AI)
బిజినెస్

GST 2.0: చిరు తిండ్లు తినేవారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇక మీ పంట పండినట్లే!

GST 2.0: జీఎస్టీలో విఫ్లవాత్మక సంస్కరణకు కేంద్రం ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నాలుగు శ్లాబుల (5%, 12%, 18%, 28%) పన్ను విధానాన్ని రెండు శ్లాబులకే (5%, 18%) పరిమితం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకూ ఉన్న 12%, 28% పన్ను శ్లాబుల్లోని వస్తువులను.. కొత్త శ్లాబుల్లోకి అడ్జస్ట్ చేశారు. కొత్త పన్ను విధానం.. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. నిత్యవసరాలు, గృహోపకరణ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. అయితే రూ.5, రూ.10, రూ.20లకు విక్రయించే ప్యాకెట్లు సైతం పన్ను తగ్గింపులోకి వచ్చిన నేపథ్యంలో వాటి ధరలను కూడా తగ్గించి విక్రయిస్తారా? అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీబీఐసీతో కంపెనీల ప్రతినిధులు భేటి
ప్యాకెట్లలో వస్తువులు విక్రయించే కంపెనీలకు చెందిన ప్రతినిధులు, పరిశ్రమ సంఘాలు శుక్రవారం కేంద్ర పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ బోర్డు (CBIC) ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయి. ఆ సమయంలో వ్యాపార సంస్థలు ఒక ముఖ్యమైన స్పష్టతను కోరాయి. చిన్న ప్యాకెట్లలో (షాంపూలు, బిస్కెట్లు, చిప్స్, చాక్లెట్స్, సోప్స్ వంటివి) ధర తగ్గించడం కష్టం కాబట్టి అదే ధరకు ఎక్కువ పరిమాణం ఇవ్వడాన్ని ధర తగ్గింపుగా పరిగణించాలని కోరాయి. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు కంపెనీ వర్గాల ప్రతినిధులు తెలియజేశారు.

త్వరలోనే మార్గదర్శకాలు..
CBICతో భేటికి హాజరైన ఓ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ‘ఇది వినియోగదారుల ధర స్థాయిలను కాపాడుతుంది. అలాగే గ్రాము లేదా మిల్లీ లీటర్‌కి ధర తగ్గినట్లవుతుంది. 2–3 రోజుల్లో మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం వినియోగదారులకు ప్రత్యక్ష ధర ఊరట కనిపించాలనుకుంటున్నప్పటికీ.. ప్రతీ ఉత్పత్తి శ్రేణిలో MRPలను తగ్గించడం కష్టమని ఆయన తెలియజేశారు. అందుకే కంపెనీలు MRP మార్చకుండా ప్యాక్‌లలో పరిమాణాన్ని పెంచే మార్గాన్ని అన్వేషిస్తున్నాయని చెప్పారు.

చిరు తిండ్లు తినేవారికి పండగే..
గ్రామీణ ప్రాంతాల్లో బిస్కెట్లు, స్నాక్స్, సబ్బులు, డిటర్జెంట్లు వంటి ఉత్పత్తులు ఎక్కువగా రూ.5, రూ.10 ప్యాకెట్లలో విక్రయమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ధర స్థాయిలను మార్చడం మార్కెటింగ్ వ్యూహాలను దెబ్బతీస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. ఓ పరిశ్రమ ప్రతినిధి మాట్లాడుతూ ప్రభుత్వం ఒకే విధమైన ఆదేశం ఇవ్వకపోవచ్చని కానీ కంపెనీలు యూనిట్ ధరను నిజంగా తగ్గించారనే ఆధారాన్ని చూపితే గ్రామేజీ పెంపును GST ధర తగ్గింపుగా అంగీకరించవచ్చని తెలిపారు. అదే జరిగితే ప్రస్తుతం లభించే క్వాంటిటీ కంటే ఎక్కవతో పరిమాణంతో ప్యాకెట్లు మార్కెట్ లోకి రానున్నాయి. దీని ద్వారా చిరు తిండ్లు (స్నాక్స్) తినేవారు ప్రత్యక్షంగా అధిక ప్రయోజనాన్ని పొందనున్నారు.

Also Read: Biggest Baby: అమెరికాలో మహాబలుడు.. పుట్టుకతోనే కొత్త చరిత్ర.. ఈ బుడ్డోడు మాములోడు కాదు!

’15-20 రోజులు ఆలస్యం కావొచ్చు’
GST లాభాన్ని వినియోగదారులకు అందించేందుకు FMCG కంపెనీలు ఉత్సాహాంగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే విధానపరమైన స్పష్టత లేకపోవడం, సరఫరా గొలుసులో ఇప్పటికే ఉన్న పెద్ద స్టాక్‌లపై కొత్త MRP స్టిక్కర్లు అతికించడం వంటి కారణాలతో 15-20 రోజుల ఆలస్యం సంభవించవచ్చని పేర్కొంటున్నారు. గోద్రేజ్ (Godrej Consumer Products) మేనేజింగ్ డైరెక్టర్, CEO సుధీర్ సితాపతి మాట్లాడుతూ ‘ప్రస్తుతం డీలర్లు, కంపెనీలు వద్ద ఉన్న స్టాక్స్ అన్నీ పాత MRPలతో ఉన్నాయి. కాబట్టి ట్రేడ్‌కి డబ్బు తగ్గించినా అది వినియోగదారుడికి నేరుగా చేరదు. కొత్త MRP ఉన్న ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. వచ్చే నెల ఆరంభం లేదా మధ్య నాటికి తగ్గిన ధరలు కనిపిస్తాయి. సెప్టెంబర్‌లో మాత్రం సరఫరా సర్దుబాట్లతో కొంత గందరగోళం ఉండొచ్చు’ అని చెప్పారు.

Also Read: Mouli viral video: మౌళి అప్పుడు సరదాగా చేసింది ఇప్పుడు నిజమైంది.. అది ఏంటంటే?

Just In

01

Anuparna Roy: గురువు మాట కూడా లెక్కచేయని వెనీస్ అవార్డు గ్రహీత.. ఎందుకంటే?

Husband Suicide: ‘నా భార్య వేధిస్తోంది.. భరించలేకపోతున్నా’.. అంటూ భర్త సూసైడ్

SPDCL CMD Orders: జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పని చేయాలి.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశం

India vs Pakistan: సరికొత్త పంథాలో భారత్-పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయనున్న బీసీసీఐ!

Huzurabad Heavy Rains: హుజురాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షం.. లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం