Janagama District: సర్కారు ఇస్తున్న సన్న బియ్యం కోసం రేషన్ షాపుకు పోతే సర్వర్(Server) రావడం లేదు.. సతాయిస్తుంది రేపు రాపో మాపు రాపో అని డీలర్ అనడంతో ఊసురుమంటూ ఇంటికి వెళ్ళిన వినియోగదారులకు ఇప్పుడు ఇక్కట్లు తప్పడం లేదు. సన్నబియ్యం తీసుకుందామని ఆశపడితే సర్కారు ఈనెల 13కు ఆఖరి రోజ ప్రచారం జరుగుతుంది. ఆఖరి రోజని ప్రచారం అవుతుండంతో రేషన్ షాపుకు పోతే అక్కడ డీలర్ సర్వర్ పనిచేస్తలేదని మేము ఏమి చేయలని చేతులెత్తేసిండని వినియోగదారులు వాపోతున్నారు. సర్వర్ పనిచేయకపోడంతో బియ్యం ఇయ్యలేమని డీలర్లు అంటున్నారని సర్కారు సర్వర్ పనిచేయకపోతే మా బియ్యం గతేమి కానని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.
ఆశపడి రేషన్ షాపుకు ఉరుకులు
గతంలో సర్కారు మూడు నెలలకు ఒక్కసారే సన్నబియ్యం ఇచ్చింది. దీంతో వినియోగదారులు ఎంతో సంతోషపడ్డారు. మళ్ళీ ఇప్పుడు మూడు నెలలు ఒక్కసారే ఇస్తారేమో అని వినియోగదారులు ఎనుకాముందు ఆగారు. అయితే ఒక్క నెలకే సన్నబియ్యం ఇస్తున్నారన్న విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు అది కూడా నెలాఖరు వరకు ఇవ్వకుండా కేవలం ఈనెల 13వరకు అనడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. చివరి రోజు బియ్యం తెచ్చుకుందామని ఆశపడి రేషన్ షాపుకు ఉరుకులు పరుగులు తీస్తే తీరా అక్కడి వెళ్ళాక సర్వర్ పనిచేయడం లేదని డీలర్లు సమాదానం ఇస్తున్నారు. దీంతో రోజంతా షాపుల వద్దనే ఎప్పుడు సర్వర్ పనిచేస్తదా, బియ్యం తీసుకుందామా అనుకున్న వినియోగదారులకు నిరాశ తప్పలేదు. జనగామ జిల్లా(Janagama District)లో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు వాతావరణం మేఘావృతం కావడంతో సర్వర్ పనిచేయడం లేదని డీలర్లు అంటున్నారు. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు అనేక మంది రేషన్ బియ్యం తీసుకోలేదని డీలర్లు తెలిపారు.
Also Read: Hanamkonda District: ఆర్టీసీ బస్సు కోసం రోడ్డు ఎక్కిన ఊరు.. ఎక్కడంటే..?
ఆఖరి రోజని ప్రచారం
జిల్లాలో 335 రేషన్ షాపులుండగా అందులో 10754 అంత్యోదయ, 150628 తెల్లరేషన్ కార్డులు, 90అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. పాతవి 163283 కార్డులుండగా, కొత్తగా ఇటీవల సర్కారు 9700కార్డులను పంపిణి చేసింది. జిల్లాలోని 12మండలాల్లోని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసేందుకు కొడకండ్ల(Kodakandla), జనగామ(Janagama), స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur)లో ఎం ఎల్ ఎస్ పాయింట్లు ఉన్నాయి. నెలకు దాదాపుగా 3500మెట్రిక్ టన్నుల బియ్యంను సర్కారు వినియోగదారులకు పంపిణి చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు అనేక మంది కార్డు వినియోగదారులు బియ్యం తీసుకోలేదు. ఇప్పుడు ఆఖరి రోజని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి రోజు అనేది నిజమో కాదో తెలియదు కాని, ఒకవేళ నిజమే అయితే మరి కొన్ని రోజులు బియ్యం అమ్మెందుకు అవకాశం ఇవ్వాలని డీలర్లు, తీసుకునేందుకు సమయం కావాలని వినియోగదారులు సర్కారు పెద్దలను కోరుతున్నారు. గతంలో లాగా నెలాఖరు వరకు అవకాశం ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు.
Alsom Read: Modi Manipur Visits: మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సందేశం