GHMC (imagecedit:twitter)
హైదరాబాద్

GHMC: స్వీపర్ల జీతాల్లో ఎస్ఎఫ్ఎల చేతివాటం.. ఆఫీసర్ల అండతో అక్రమాలు

GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందిస్తున్న సేవలను పారదర్శకంగా అందించటంతో పాటు తెల్లవారే కల్లా నగరాన్ని శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వారి కష్టాన్ని బట్టి జీతాలు చెల్లించేందుకు ఉన్నతాధికారులు ఎన్ని సంస్కరణలను తీసుకువచ్చినా, వాటిని కొందరు అక్రమార్కులు నిర్వీర్యం చేస్తూ తమ అక్రమార్జనను యదేచ్చగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీని వినియోగించుకుని ఆధునిక సంస్కరణలను ప్రవేశపెట్టినా కార్మికుల శ్రమ దోపిడీకి బ్రేకే పడటం లేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ(GHMC) సిటీవాసులకు అందిస్తున్న సేవల్లో ముఖ్యమైన పారిశధ్ద్యం. ఈ విభాగంలో దాదాపు 15 వేల మంది కార్మికులు ఔట్ సోర్స్(Outsourcing) ప్రాతిపదికన విధులు నిర్వహిస్తుండగా, వీరిలో ఎక్కువ శాతం మహిళా కార్మికులే ఉన్నారు.

జీహెచ్ఎంసీలో ఫేస్ రికాగ్నేషన్ సిస్టమ్

కాగా, వీరిలో సింహా భాగం కార్మికులు నిర్లక్షరాస్యులు కావటంతో కార్మికుల పనితీరును పర్యవేక్షించే శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ (SFA) మొదలుకుని, మెడికల్ ఆఫీసర్, సర్కిల్‌కు బాస్ గా వ్యవహారించే డిప్యూటీ కమిషనర్ లు సైతం వీరి శ్రమను దోచుకుంటున్నట్లు కార్మికులు వాపోతున్నారు. ఒక్కో పారిశుద్ధ్య కార్మికురాలుకు నెలకు రూ. 15 వేల పై చిలుకు జీతం చెల్లించాల్సి ఉంది. ఈ నెల రోజుల పాటు కార్మికులకు నాలుగు రోజుల పాటు వీకాఫ్ లుంటాయి. కార్మికుల హాజరులో పారదర్శకత కోసం జీహెచ్ఎంసీ ఇటీవలే ఫేస్ రికాగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను అమల్లోకి తెచ్చిన సంగతి తెల్సిందే.

గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు రెండు షిఫ్టులు, సికిందరాబాద్ రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో మూడు షిఫ్టులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి విధుల్లో చేరగానే, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) తన ఫోన్ లోని ఎఫ్ఆర్ఎస్ యాప్ లో వీరి ఫొటోలను తీసి అప్ లోడ్ చేయాల్సి ఉంది. కానీ చాలా సర్కిళ్లలో ఎస్ఎఫ్ఏలు కార్మికుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు.

Also Read: Heavy Rains: గచ్చిబౌలిలో పిడుగుపాటు.. పరుగులు తీసిన జనం..

నెలలో పది రోజుల జీతాలను కట్.

కార్మికులు ప్రతి రోజుల విధులు నిర్వర్తించినా, వారికి నెల జీతంలో ఆరు నుంచి పది రోజుల పాటు వేతనాలు కట్ అవుతున్నట్లు కార్మికులు వాపోయారు. ఒక్కో ఆబ్సెంట్ రూ. 500 చొప్పున జీతాల్లో కోతలు విధిస్తున్నట్లు కార్మికులు వాపొతున్నారు. జీహెచ్ఎంసీ(GHMC)లోని దాదాపు అన్ని సర్కిళ్లలో ఈ తతంగం కొనసాగుతున్నట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల్లో కోతతో కొందరు కార్మికులు జూలై(july) మాసం మొత్తం వీకాఫ్(Week Off) లు కూడా తీసుకోకుండా పని చేసినా, వారికి జూలై నెలలో పది రోజుల జీతాలను కట్ చేసినట్లు వెల్లడించారు.

జీతాల కోతలపై ఎస్ఎఫ్ఏ(SFA)ను ప్రశ్నిస్తే తాను ప్రతిరోజు ఫొటోలు తీసి పంపుతున్నానని, కంప్యూటర్ లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండవచ్చునని, ఈ నెల సర్దుకోండి వచ్చే నెల చూద్దామని సమాధానమిస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. శానిటేషన్ విభాగంలో కార్మికులుగా పని చేస్తున్న వారిలో దాదాపు సగం మంది అద్దె ఇళ్లలోనే నివాసముంటున్నారు. ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే చాలు యజమానికి ఇంటి అద్దెలు చెల్లించాల్సి ఉంటుందని, ఈ క్రమంలో తమకు రావాల్సిన కేవలం రూ. 15 వేల జీతంలో కొన్ని సార్లు సగం మాత్రమే చెల్లిస్తున్నట్లు, ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమని ఎస్ఎఫ్ఏ(SFA)లు దురుసుగా సమాధానమిస్తున్నట్లు కొందరు స్వీపర్లు వాపోయారు.

Also Read: Bhatti Vikramarka: బీజేపీ నేతలు డ్రామాలు బంద్ చేయాలన్న భట్టి

ప్రతి సర్కిల్ లో డమ్మీలు

జీహెచ్ఎంసీ(GHMC)లోని 30 సర్కిళ్లలో సుమారు 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నా, వీటిలో సగానికి పైగా డమ్మీ పోస్టులే ఉన్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎస్ఎఫ్ఏలు తమ పైనున్న మెడికల్ ఆఫీసర్ల(Medical Officer)ను, మెడికల్ ఆఫీసర్లు డిప్యూటీ కమిషనర్లను మేనేజ్ చేసుకుని తమ భార్య, తల్లి, బంధువులను కూడా కార్మికులుగా నియమించి, వారిచే పని చేయించకుండా ఇంట్లోనే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేసుకుని అలాంటి డమ్మీ పోస్టులకు కూడా జీతాలను క్లెయిమ్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ రకమైన డమ్మీ పోస్టులకు గాను ఎఫ్ఆర్ఎస్(FRS) అటెండెన్స్ స్వీకరిస్తున్నందున ఎస్ఎఫ్ఏకు ఒక్కో డమ్మీకి రూ.500 చొప్పున చెల్లిస్తూ మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు ఎక్కువ మొత్తంలో అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో సికిందరాబా(Secunderabad)ద్ సర్కిల్ లో ఓ మెడికల్ ఆఫీసర్ నెలకు సుమారు 100 నుంచి 125 డమ్మీ పోస్టులకు నాలుగేళ్ల పాటు అటెండెన్స్ లను క్లెయిమ్ చేసి, రూ. పది కోట్ల వరకు సంపాదించుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. శానిటేషన్ విభాగం ఉన్నతాధికారుల వరకు కూడా వాటాలుండతటంతో ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఉన్నతాధికారులు సైతం ముందుకు రావటం లేదని తెలిసింది.

Also Read: GHMC Commissioner: సహాయక చర్యల్లో వేగం పెంచండి: కమిషనర్ కర్ణన్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ