HHyderabad Road Accident: ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, కోహెడా ( Koheda ) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక యువకుడి నిర్లక్ష్యం వలన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. అతి వేగంతో కారును డ్రైవ్ చేస్తూ, బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడిని ఢీ కొట్టాడు. ఈ రోడ్డు యాక్సిడెంట్ లో ఘటనలో బీ ఫార్మసీ చదువుతున్న ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడు తీవ్రగాయాలతో హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
Also Read: CM Revanth Reddy: నిరుద్యోగం తగ్గాలంటే నైపుణ్యాలు కావాలి.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీపై సీఎం దృష్టి
కోహెడా ( Koheda ) వద్ద బైక్ ను ఢీ కొట్టి కారుతో పారి పోతుండగా ప్రదీప్ వర్మ ను చైతన్యపురి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో కారు అద్దం పగిలి ఉండటంతో, వెంటనే కారును ఆపి చైతన్యపురి పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఏం జరగలేదు కారు కొంచం డ్యామేజ్ అయ్యింది. రిపేర్ కి వెళ్తున్న అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ అద్దంపై ఉన్న రక్తపు మరకలు, జుట్టును ను చూసి అనుమానంతో అతడిని పట్టుకున్నారు.
ఇక అదే సమయంలో కోహెడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడ యాక్సిడెంట్ చేసింది ఇతనే అని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. ఈ స్కోడా కారును డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రదీప్ వర్మ గా గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న ప్రదీప్ ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు అప్పగించారు. యువతి స్పందన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువకుడు సాయి కుమార్, స్పందన దూరపు బంధువులు. కాలేజ్ దగ్గర ఆమెను పిక్ చేసుకుని హాస్టల్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రదీప్ వర్మ పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.