Case on Nageshwar Rao: గుంటూరు వాసులను బెదిరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే కూటమి నాయకులపై పగ తీర్చుకుంటామని కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏమాత్రం అనుమానం లేదని, గుంటూరు జిల్లా అవతల ఉన్న వారి గొంతులు తెగ్గోస్తామని, ఆ జిల్లాకు ఇవతల ఉన్న వారిని ఇళ్ల నుంచి బయటకు లాగి కొడతామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు.
ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఆయన వ్యాఖ్యలను టీడీపీ నేతలు, కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో వెస్ట్ డీఎస్పీకి టీడీపీ నేతలు కనపర్తి, మద్దిరాల మ్యానీ, బుజ్జి, యల్లావుల అశోక్, అడకా శ్రీనులు ఫిర్యాదు చేశారు. కారుమూరి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కూటమి నేతలు ఫిర్యాదు చేశారు.
Also read: AP Politics: ఏపీలో ఖాకీ ఫైట్.. ఎవ్వరూ తగ్గట్లే.. కంట్రోల్ అయ్యేనా?
కారుమూరి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో వివరించారు. కారుమూరి మాట్లాడిన మాటలతో తమకు భయంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులకు నేతలు వివరించారు. తణుకు టూన్, తణుకు రూరల్, ఇరగవరం, అత్తిలి పోలీస్ స్టేషన్లలోనూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కాగా, వైసీపీ పాలనలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎర్రిపప్ప అనడం, అదేంటని ప్రశ్నిస్తే ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని సమర్థించుకున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది.