తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Hyderabad Police: డ్రంకెన్ డ్రైవ్ పై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో పీకలదాకా మద్యం సేవించి వాహనాలు నడిపిన 389మంది పట్టుబడ్డారు. రోడ్డు ప్రమాదాలతోపాటు కొందరు ప్రాణాలు పోగొట్టుకోవటానికి కారణమవుతున్న డ్రంకెన్ డ్రైవ్ ను అరికట్టటానికి మూడు వారాలుగా సైబరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
Also read: Telangana Govt: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉగాది నుండి కొత్త పథకం ప్రారంభం..
ప్రతీ శనివారం రాత్రి కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి నడుపుతున్న వారిని పట్టుకుంటున్నారు. ఈ శనివారం రాత్రి కూడా మందు కొట్టి డ్రైవింగ్ చేసిన 315మంది ద్విచక్ర వాహనదారులు, 13 ఆటోవాలాలు, 59మంది కారు డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 26మందికి పరీక్షలు జరుపగా వారి రక్తంలో ఆల్కహాల్ శాతం 100 నుంచి 500 మిల్లీలీటర్లు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also read: KTR Comments: కేసీఆర్ మంచివారే.. నేను కాదు.. కేటీఆర్
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిన అందరినీ ఆయా కోర్టుల్లో హాజరు పరచనున్నట్టు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఎవరివైనా ప్రాణాలు పోవటానికి కారణమైతే నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసుల్లో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/