స్వేచ్ఛ కరీంనగర్: KTR Comments: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని తప్పులు చేశామని, తాము మానవ మాత్రులమేనని జరిగిన పొరపాట్లను గుర్తించి సవరించుకునే ప్రయత్నం చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని అన్నారు.
Also read: Fire Accident: ప్రభుత్వ వైద్యశాలలో అగ్ని ప్రమాదం.. మందులు అగ్గిపాలు..
కొందరు నాయకులకు పార్టీ పదవులు లతో పాటు ఇతర పదవులు ఇవ్వాల్సిందని అన్నారు. జరిగిన పొరపాట్లను సవరించుకుంటూ ముందుకు సాగుతున్నామని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ఏడాది పార్టీ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఏడాది పాటు వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. నేటితరం యువతకు తెలంగాణ ఉద్యమం జరిగిన తీరును వివరించడానికి ఫోటో ఎగ్జిబిషన్‌తో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ 27 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు.
Also read: viral: భార్యతో భర్త ఘర్షణ.. భార్య చేసిన పనికి అంతా షాక్
పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలకు పార్టీ పదవులు ఇస్తామని ప్రకటించారు. గతంలో ఎమ్మెల్యే లు సిఫారసు చేసిన వారికి పదవులు కేటాయించడం వల్ల అధికారానికి దూరమయ్యామని కేటీఆర్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి వారికి పదవులు ఇచ్చి పార్టీని పునర్నిర్మాణం చేస్తామని కేటీఆర్ తెలిపారు. రానున్న మూడు సంవత్సరాల కాలం పార్టీ నిర్మాణం పైన దృష్టి సారిస్తామని తెలిపారు.
బీజేపీ కాంగ్రెస్ రెండు రెండే..
రాష్ట్రంలో అధికారం లో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు రెండు రెండేనని ఉన్నారు. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి మర్చిపోయారని కేటీఆర్ ఆరోపించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే జన్ ధన్ ఖాతాలు ప్రారంభించి ప్రతినెల డబ్బులు వేస్తామని చెప్పిన మోడీ మాట మరిచారని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 16 నెలల కాలంలో ప్రజలను మోసం చేసింది అని ఆరోపించారు.
Also read: Mahabubabad news: ప్రమోషన్ కోసం పాకులాడి.. చివరకు సస్పెన్షన్ వరకు.. ఓ ఎస్సై అసలు కథ ఇదే!
కరీంనగర్ ఎంపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కి ఏమీ తెలియదని ఎద్దేవ చేశారు. మజీదులు కూలుస్తాం మందిరాలు కడతాం అని చెప్పడం తప్ప ఇప్పటివరకు ఒక గుడి ఒక బడి కట్టిన సందర్భాలు లేవని కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ మాటలకే పరిమితం గాని చేతలు ఉండవని కేటీఆర్ అన్నారు.
కేసులు పెడుతున్న పోలీసులను వదలం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల పై వేధింపులు ఎక్కువయ్యాయని కేటీఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే కేసులు పెడుతున్న పోలీసులందరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కొంత మంది పోలీసులు అప్పటివరకు రిటైర్మెంట్ అవుతామని అనుకుంటున్నారని రిటైర్మెంట్ ఆయన విదేశాలకు పారిపోయిన తీసుకువచ్చి ఇప్పుడు పెడుతున్న అక్రమ కేసులకు వడ్డీతో సహా వాళ్లకి చెల్లిస్తామని కేటీఆర్ అన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/