viral: ఎవరైనా అమాయకులు అని చెప్పడానికి సాధారణంగా ఏం చెప్తుంటారో తెలుసు కదా.. మావాడు అమాయకుడు లేదా మా అమ్మాయి అమాయకురాలు నోట్లో వేలు పెడితే కూడా కొరకరు అని. కానీ రాజస్థాన్ లో ఓ మహిళ.. ఏకంగా నాలుకనే కొరికేసింది.
ఆధునిక కాలంలో స్త్రీలు అన్ని విషయాల్లోనూ ముందుంటున్నారు. అంటే కొలువుల్లో ఉన్నత పదవులు సంపాదించడం దగ్గరి నుంచి అంతరిక్షంలో ప్రయాణించే దాకా మగవారికి దేంట్లోనూ తీసిపోము అనే విధంగా వారు దూసుకుపోతున్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే ఏ మాటకి ఆ మాట.. గొడవలు, కొట్లాటల విషయంలోనూ మహిళలు పురుషులకు దీటుగా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇదివరకటిలా అణిగిమణిగి ఉండి మగవాడి కింద పడి ఉండటానికి స్త్రీ జాతి ఇష్టపడటం లేదు. ఇది కచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ అక్కడక్కడ నమోదవుతున్న కొన్ని సంఘటనలు కలవరానికి గురి చేస్తున్నాయి.
Mahabubabad news: ప్రమోషన్ కోసం పాకులాడి.. చివరకు సస్పెన్షన్ వరకు.. ఓ ఎస్సై అసలు కథ ఇదే!
ఇటీవలి కాలంలో పురుషులపై మహిళలు దాడికి పాల్పడుతున్న ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. నిన్న గాక మొన్న ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో భర్తను భార్య ముక్కలుగా నరికి చంపడం చూశాం. అనంతరం భర్తపై భార్య దాడి చేసిన పలు సంఘటనలు చూశాం. తాజాగా రాజస్థాన్ లో మరో ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన భార్య.. తీవ్ర కోపంతో అతని నాలుకను కొరికేసింది. తీవ్ర రక్తస్రావమైన అతను.. బతుకు జీవుడా అంటూ భయంతో పరుగులంకించుకున్నాడు. ఊడిపోయిన నాలుక ముక్కను చేతిలో పట్టుకొని ఆస్పత్రికి పరుగుపెట్టాడు. ప్రస్తుతం అతను కొలుకుంటున్నాడు.
ఏం జరిగిందంటే..?
రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలోని బకానీ పట్టణానికి చెందిన కన్హయలాల్ సైన్ (25), రవీనా సైన్ (23) ఇద్దరూ భార్యాభర్తలు. వీరిద్దరికి ఏడాదిన్నర క్రితమే పెళ్లయింది. పెళ్లి జరిగిన నాటి నుంచి వీరి కాపురం సాఫీగా సాగడం లేదు. భార్యభర్తల మధ్య నిత్యం గొడవలే జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా వీరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దిరి మధ్య మాటామాటా పెరిగింది. అది అంతకంతా పెరిగి గొడవ తీవ్రమైంది. దాంతో భార్య రవీనా సైన్ కు కోపం కట్టలు తెంచుకుంది. కంట్రలో చేసుకోలేకపోయిన ఆమె.. భర్త కన్హయలాల్ నాలుకను కొరికేసింది. దెబ్బకు అతని నాలుకలో కొంతభాగం తెగిపోయింది. గమనించిన బంధువులు వెంటనే బాధితుణ్ని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ.. తెగిపోయిన కన్హయలాల్ నాలుకను పరిశీలించిన వైద్యులు దాన్ని కలిపి కుట్టేశారు. కన్హయ సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం బాధితుడు మాట్లాడే పరిస్థితిలో లేడని అందువల్ల, అతడి నుంచి వాంగ్మూలం తీసుకోవడం సాధ్యం కాలేదని తెలిపారు. అతను వాంగ్మూలం ఇస్తే ఆమెను అరెస్ట్ చేస్తామని చెప్పారు. కాగా, భర్తపై దాడి చేసిన అనంతరం భార్య రవీనా ఓ గదిలో వెళ్లి తలుపులు మూసుకొని కత్తితో చేతి మణికట్టును కోసుకొని ఆత్మహత్యకు యత్నించడం కొసమెరుపు.
మరో విషయం ఎంటంటే.. భార్యభర్తల్లో ఎవరో ఒకరు నోరు మూసుకొని ఉంటేనే సంసారం సాఫీగా సాగుతుందని అంటుంటారు. కానీ.. ఈ సంఘటన ప్రకారం భార్య రవీనా ఆమె భర్త నాలుక కొరికేసి బలవంతంగానైనా అతని నోరు మూసేసింది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.