Mahabubabad Crime: అమ్మ అనే పదం పవిత్రం. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే, అమ్మ అనే పదానికి కూడా కళంకం వస్తుందా అనే ప్రశ్న మన మదిలో మెదలక మానదు. ఇలాంటి ఘటనే ఇది. సభ్యసమాజం ఈ ఘటన తెలుసుకొని నివ్వెర పోయింది. అమ్మ చేసే పనులు వేరు.. ఈ అమ్మ చేసిన పని వేరంటూ.. మహిళా లోకం ఛీ కొడుతోంది. అంతలా ఛీ కొట్టే ఘటన ఏమిటని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.
తన సుఖం కోసం కన్న కూతురు జీవితాన్నే తన ప్రియుడికి తాకట్టు పెట్టిన ఓ తల్లి… కామంతో కళ్లు మూసుకుపోయి వావి వరుసలు మరిచి కూతురు వరుసయ్యే బాలికకు కడుపు చేశాడు ఓ కామాంధుడు… సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణమైన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కొంతకాలం క్రితం గొడవ పడి ఒకరికొకరు దూరంగా జీవనం సాగిస్తున్నారు. భర్త నుంచి దూరంగా ఉండలనుకున్న భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ సమీపంలో జీవనం సాగిస్తుంది.
ఈ క్రమంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తల్లితో అక్రమ సంబంధం కొనసాగుతున్న రాము ఆమె కూతురు(16)పై కన్నేశాడు. వరుసకు కూతురు అవుతుందని తెలిసినా వావి వరుసలు మరిచి తన కామ వాంఛ తీర్చుకునేందుకు పన్నాగం పన్నాడు. తన కూతురు జీవితం పాడు అవుతుందనే సోయి లేకుండా ప్రియుడి కోరిక తీర్చేందుకు సహకరించింది ఆ తల్లి.
బాలిక తల్లి ప్రోద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు బాలికపై అత్యాచారం చేయడంతో అభం శుభం తెలియని బాలిక గర్భవతి అయింది. ఈ పాపం ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధిత బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండాలని భావించిన అమ్మమ్మ గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని ఓ ప్రవేట్ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ చేయించినట్టు స్థానికులు తెలిపారు.
Also Read: Warangal News: ఒంటరి మహిళలే వీరి టార్గెట్.. అసలేం చేస్తారంటే?
కేసు నమోదు చేశాం – తొర్రూరు సీఐ తౌటం గణేష్
బాలికకు తొర్రూరులోని అమ్మ మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో అబార్షన్ జరిగిన విషయంపై చైల్డ్ లైన్ కు ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. వారు విచారణ చేపట్టగా, ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టి బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన పోలోజు రాము, అందుకు బాలిక తల్లి, అబార్షన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యంపై అత్యాచారం, పోక్సో కేసులను నమోదు చేసినట్లు తొర్రూరు సీఐ తౌటం గణేష్ తెలిపారు.