స్వేఛ్చ, జోగిపేట: Fire Accident: జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చెందిన భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు గంట సేపు భవనంలో మంటలు రావడంతో ఆ భవనంలో ఉన్న మందులు దగ్దం అయ్యాయి. సుమారుగా 20 లక్షల విలువ చేసే మందులు మంటల్లో కాలిపోయినట్లుగా ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
Also read: Mahabubabad news: ప్రమోషన్ కోసం పాకులాడి.. చివరకు సస్పెన్షన్ వరకు.. ఓ ఎస్సై అసలు కథ ఇదే!
ఆసుపత్రికి సంబంధించిన మందులను చాలా సంవత్సరాలుగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ భవనంను ఆనుకొని ఉన్న భవనంలో ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే ఇంజక్షన్‌లు, గ్లౌజులు, మందులు, బ్యాండేజీలతో పాటు సర్జికల్ వస్తువులను నిలువ ఉంచుతారు. గత మూడు రోజుల క్రితమే ఆసుపత్రికి మందులు వచ్చినట్లు ఫార్మాసిస్టు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Also read: KCR: జగన్ దారిలో కేసీఆర్.. చివరికి అదే జరిగేనా?
రాత్రి 9.30 గంటల ప్రాంతంలో స్టోర్ గదిలో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను ఆరిపేందుకు చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ పాండు సంఘటన స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సుమారు గంట సేపటి వరకు మంటలు వస్తుండడంతో భవనం కిటికీలను బద్దలు కొట్టి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు . ఆసుపత్రి భవనంలో మంటలు వస్తున్నట్లు తెలుసుకున్న స్థానికులంతా ఆసుపత్రి వద్దకు పరుగులు తీసారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/