Sir CV Raman Talent Search Exam: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 32వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో 1000 పాఠశాలల నుండి 100000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే సుచిరిండియా ఫౌండేషన్ హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలిత కళా తోరణం లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ తో పాటు జాతీయ, రాష్ట్ర, జిల్లాల వారీగా ర్యాంకులను ప్రకటించింది. అలాగే విద్యార్థులు ప్రతిభకు కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లి తండ్రులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీనటుడు రావు రమేష్, సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ హాజరై అవార్డులు ప్రధానం చేశారు.
అనంతరం సుచిరిండియా ఫౌండేషన్ అధినేత లయన్ కిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ టాలెంట్ పరీక్ష నిర్వహించామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సాయం చేసే గుణం అందరికి ఉండాలి అన్నారు.