Rekha Boj
ఎంటర్‌టైన్మెంట్

SKN Controversy: పోరా.. ఎస్‌కెఎన్‌‌పై మండిపడిన హీరోయిన్

SKN Controversy: గత కొన్నిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదురుకుంటుందని చెప్పుకోవాలి. ఒకవైపు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా తెలుగు పరిశ్రమను తీర్చిదిద్దటానికి కొందరు దర్శకనిర్మాతలు, ఆర్టిస్టులు ప్రయత్నిస్తుంటే, మరికొందరి ప్రవర్తన భారతదేశంలోనే తల దించుకునేలా చేస్తోంది అంటున్నారు విశ్లేషకులు. కేవలం గతేడాది జరిగిన సంధ్య థియేటర్ ఘటన నేపథ్యం మాత్రమే కాదు అనేక సార్లు టాప్ హీరోలు, దర్శక నిర్మాతలు, కొందరు నటులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అలజడిని సృష్టిస్తున్నాయి. అవన్నీ పక్కనే పెడితే.. తాజాగా ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్‌(SKN) చేసిన వ్యాఖ్యలు మరోసారి దూమారం రేపుతున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే..

ఇప్పటికే తెలుగు హీరోయిన్లకు, ఆర్టిస్టులకు సొంత పరిశ్రమే సరైన అవకాశాలు కల్పించడం లేదని, వారిని సరిగ్గా ట్రీట్ చేయడం లేదు అనేది పెద్ద విమర్శ. అలాగే ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు కూడా పలుమార్లు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తమని ట్రీట్ చేసిన విధానంపై ఘాటు విమర్శలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా లవ్ టుడే(Love Today) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) ఇప్పడు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return Of The Dragon) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి అతిథిగా హాజరైన నిర్మాత ఎస్‌కెఎన్‌ (Producer SKN) తెలుగు హీరోయిన్లపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘మేము తెలుగు రాని హీరోయిన్‌లను అభిమానిస్తాం. ఎందుకంటే.. తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమౌతుందో ఈ మధ్యనే అర్థమైంది. ఇకనుంచి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని నేను, దర్శకుడు సాయిరాజేశ్‌ నిర్ణయించుకున్నాం’’ అని అన్నారు. (SKN Comments On Telugu Heroines)

దీంతో ఎస్‌కెఎన్‌ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఆయన గతంలో దర్శకుడు సాయిరాజేశ్‌(Sai Rajesh) తో కలిసి తెరకెక్కించిన బేబీ(Baby) సినిమాలో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్. అయితే, ఇటీవల ఆమె ఎస్‌కెఎన్‌ తో ఓ ప్రాజెక్ట్ చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీని గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య సిద్దు జొన్నలగడ్డ, ఆనంద్‌ దేవరకొండతోలతో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల అనేక వేదికలపై టాలీవుడ్ పెద్దలే నోరు జారడం చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది.

మండిపడిన హీరోయిన్..

గత దశాబ్దం నుండి తెలుగు పరిశ్రమలో తెలుగు హీరోయిన్ల కోసం గట్టి స్వరాన్ని వినిపిస్తున్నా హీరోయిన్ రేఖ భోజ్(Rekha Boj) ఈ వ్యాఖ్యలపై మండిపడింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “ఇప్పుడేదో తెగ ఇచ్చేస్తున్నట్టు… పోరా. ప్రతివాడు పెద్ద ఉద్దరించేసినట్టు ఎదవ బిల్డప్పులు. ఒక రకంగా ఇది తెలుగు అమ్మాయిల మీద అఫిషియల్ గా బ్యాన్ అనౌన్స్ చేసినట్టే. మా బ్రతుకు తెరువు మీద కొట్టేలా మాట్లాడాక ఇక మీకేంటి ఇచ్చేది గౌరవం…మిడిల్ ఫింగర్.” అంటూ ఫైర్ అయ్యారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?