chhava
ఎంటర్‌టైన్మెంట్

Chhaava: ‘ఛావా’ నిజంగానే గొప్ప సినిమానా?

Chhaava: ఒకవైపు దక్షిణాది సినిమా భారతీయ చిత్ర పరిశ్రమపై పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. బాలీవుడ్ కుదేలు అవుతున్నదనేది వాస్తవం. కొన్ని ఏళ్ల క్రితం వరకు భారతీయ చిత్ర పరిశ్రమ అంటేనే బాలీవుడ్ అని చెప్పుకునేవారు. ఇలాంటి తరుణంలోనే రొటీన్ రొట్ట కొట్టుడు సినిమాలతో బాలీవుడ్ అవే సినిమాలని ప్రేక్షకులపై రుద్దుతూ వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాది సినిమా కేవలం పాన్ ఇండియానే కాదు రీజినల్ సినిమాలతోను సత్తా చాటింది. దీంతో కంట్రీ ఫోకస్ అంతా దక్షిణాది సినిమాపై షిఫ్ట్ అయ్యింది.

ఇటీవల బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తాను తమిళ్ లేదా మలయాళ సినీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఓ పాన్ ఇండియన్ లెవెల్ మెగా రౌండ్ టేబుల్ లోను టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ.. బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు రచ్చ చేసిన.. లాజికల్‌గా అందులో వాస్తవం ఉన్నా మాట నిజం. షారుక్, సల్మాన్, అక్షయ్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా బాలీవుడ్ ఫేట్‌ని మార్చలేకపోయారు. ఈ తరుణంలోనే రిలీజైన విక్కీ కౌశల్(Vicky kaushal) ‘ఛావా'(Chhava) సినిమా సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా తిరిగి బాలీవుడ్ కు ఊపిరి పోసిందని అంటున్నారు. నిజానికి ‘ఛావా’ నిజంగానే గొప్ప సినిమానేనా? అంటే.. కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజియన్, దేశ భక్తి సినిమా అనేది ది బెస్ట్ సెల్లింగ్ పాయింట్ గా మారిపోయింది. ఓకే.. సెల్లింగ్ పాయింట్ కాబట్టి ఆ రకమైన సినిమాలు తీస్తున్నారు అనుకుందాం కానీ.. క్రాఫ్ట్ మ్యాన్ షిప్ పరిస్థితి ఏంటి? క్లైమాక్స్ లో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఉంటే గొప్ప సినిమా, మంచి సినిమానో అయిపోతుందా? ఇక్కడ గొప్ప, మంచి సినిమా అంటే కేవలం మెసేజ్ మాత్రమే కాదు. ‘ఛావా’ విషయానికొస్తే.. భయపెట్టి దేశభక్తిని నింపే ప్రయత్నం క్లియర్ గా కనిపించింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ తనకు చాలా సాధారమైన నట విధ్వంసాన్ని ప్రదర్శించటం మాత్రమే హైలెట్. ఇతర నటులు టెలి ప్రాంప్టర్ లో చూసి దేశాన్ని ఎలా ప్రేమించాలి అని చదువుతున్నట్లు అనిపించింది. విక్కీ కౌశల్ ని ఒక రాజుగా కాకుండా సూపర్ హీరోల చూపించడం చారిత్రాత్మక సినిమాలకు మంచిది కాదు. ఇక రాజసాన్ని ప్రదర్శించే సీక్వెన్స్ ని తెరకెక్కించడంలో ఒక్క సంజయ్ లీల భన్సాలీ మినహా అందరు బాలీవుడ్ డైరెక్టర్లు వెనకపడినట్లు ఈ సినిమా ద్వారా మరోసారి తెలుస్తుంది. రక్తపాతం జరుగుతున్న సన్నివేశాలు హోలీని తలపించడం చూస్తాం. సినిమా పాయింట్ ఏదైనా హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించడంలో విపరీతమైన లిబర్టీ ఎలా తీసుకుంటారు అనేది ప్రశ్న కాదు మూర్కత్వం. ఈ సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నా కొన్ని సన్నివేశాల్లో విక్కీ కౌశల్ నట విశ్వరూపం మాత్రమే సినిమా సక్సెస్ బజ్ కు ప్రధాన కారణం.

టాలీవుడ్ హీరోలు ‘ఛావా’లో నటిస్తే..

ఈ సినిమా చూసిన అభిమానులు కొందరు ‘ఛావా’లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లేదా ప్రభాస్ ఎవరైనా నటిస్తే ఇంకో లెవెల్లో ఉండేది అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే స్టార్‌డమ్ అనేది చాలా పెద్ద ఎస్సెట్. కానీ.. విక్కీ కౌశల్ నటన స్థాయిని ఇప్పుడునా తరంలో ఎవరు అందుకొని ఎత్తులో విక్కీ ఉన్నా మాట వాస్తవం. ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి:

పోరా.. ఎస్‌కెఎన్‌‌పై మండిపడిన హీరోయిన్

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు