Chandoo Mondeti
ఎంటర్‌టైన్మెంట్

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Chandoo Mondeti Interview: ‘తండేల్’ మూవీ పైరసీపై దర్శకుడు చందూ మొండేటి షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపొయినంత బాధని అనుభవించామని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ‘తండేల్’ మూవీ సక్సెస్‌ని పురస్కరించుకుని మీడియాతో తన ఆనందాన్ని షేర్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, రిలీజ్ రోజే పైరసీ బారిన పడింది. అయినా కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. హీరో నాగచైతన్యకు ఇది మొట్టమొదటి రూ. 100 కోట్ల చిత్రం. చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి మీడియాకు సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

Also Read- Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది.. ఎంత క్యూట్‌గా ఉందో!

‘తండేల్’ బయోపిక్ కాదు
‘తండేల్’ సినిమా బయోపిక్ కాదు. వాస్తవ సంఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ ఇది. ఇందులో ఉన్న ఇన్సిడెంట్ మాత్రం వాస్తవం. మత్య్సలేశ్యం నుంచి గుజరాత్ వెళ్లడం, అక్కడ నుంచి పాక్ సరిహద్దుల్లో దొరకడం, వారి కోసం పోరాటం.. ఇదంతా వాస్తవమే. దీనికే మేము ఒక అందమైన ప్రేమకథతో రెడీ చేశాం. అందుకే సినిమాలో కూడా ఎక్కడా రియల్ పేర్లు ఉపయోగించలేదు. మొదట ఈ కథ అనుకున్నప్పుడు పాక్ నేపధ్యంలో ఈ సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ, గట్టిగా ఆలోచిస్తే ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్ కనిపించింది. ఈ ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని చేరవేసుకోవడానికి నెల రోజులు ఆగాలి. ఈ పాయింట్ నన్ను బాగా ఎక్జయిట్ చేసింది. అందుకే మొదటి నుంచి ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టొరీగానే చూశాం, ప్రమోట్ చేశాం. ఇది ప్యూర్ లవ్ స్టొరీ. పాక్ జైలు‌లో ఒక సెంట్రి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్. వాళ్ళు మన తెలుగు సినిమాలు బాగా చూస్తారు. 22 మంది మత్య్సకారులు ఈ ఇన్సిడెంట్ గురించి నాతో చెప్పారు. కొంతమంది ఆడియన్స్ పాక్ ఎపిసోడ్ ఇంకాస్త ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పాక్ ఎపిసోడ్స్‌పై సెన్సార్ సమస్యలను ఫేస్ చేశాం. గ్లింప్స్‌లో జెండా చూపించడానికే వారు ఒప్పుకోలేదు. ఇంకా డైలాగ్స్, మ్యూట్స్, విజువల్ కట్స్ చాలా వున్నాయి. దాదాపు ముఫ్ఫై శాతం ఎమోషన్ సెన్సార్ కారణంగా తగ్గింది. అయినా కూడా ది బెస్ట్ ఇచ్చాం. ఇందులోని ప్రతి ఎలిమెంట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ఇంతటి ఘన విజయం సాధించింది.

పైరసీతో గుండెల్లో గునపం దిగినట్లయింది
సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడటంతో గుండెల్లో గునపంతో పొడిచినంతగా బాధపడ్డాను. నిజంగా ఆ బాధను మాటల్లో చెప్పలేను. సినిమాని థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీస్తాం. అలాంటిది పైరసీ బారిన పడటం, ఆర్టీసీ బస్సుల్లో సైతం ప్రదర్శించడం చాలా బాధాకరం. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో.. అలాంటి పెయిన్‌ని అనుభవించాను. అయినా సినిమా ఘన విజయం సాధించి, ఇండస్ట్రీ నుండి ప్రశంసలు రావడంతో మనసుకుదటపడింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది దర్శకులు, హీరోలు కాల్ చేశారు. నాని, రామ్ వంటివారు కాల్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ .. ఎలా వుంది ఫీలింగ్ అన్నారు. ‘ఇది ఒక దర్శకుడి సినిమా’ అని దర్శకేంద్రుడు చెప్పడం వెరీ మెమరబుల్.

Also Read- Vishwambhara: మెగాస్టార్‌తో మేనల్లుడు.. ‘విశ్వంభర’ తాజా అప్డేట్ ఇదే!

అది నాగార్జునగారి గొప్పతనం
కింగ్ నాగార్జునగారు కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశారు. కానీ, ఈ సినిమా సక్సెస్‌ని ఆయన చాలా ఎంజాయ్ చేశారు. ఆయన ‘థ్యాంక్యూ చందూ.. వుయ్ లవ్ యూ’ అని చెప్పడం నిజంగా అది ఆయన గొప్పతనం. అది నాకు గొప్ప ప్రశంసగా భావిస్తున్నాను. ఈ సినిమా ఒక గౌరవం తీసుకొస్తుందని ముందు నుంచి నమ్మాను. ప్రేక్షకులు కూడా అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని ఇచ్భారు. ఈ విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ చాలా కీలక పాత్ర వహించారు.

చైతూతో తెనాలి రామకృష్ణ
ఇది గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్, వాసు, చైతూ, దేవిశ్రీ .. ఇలా అంతా కలిసి చేసిన ఎఫర్ట్. నా అక్షర రూపానికి వారంతా విజువల్‌ని ఇచ్చారు. చైతూకి నేనంటే చాలా ఇష్టం. మా మధ్య చాలా మంచి స్నేహం వుంది. చైతు చాలా సిన్సియర్.ఆయన అంతటి ఎఫర్ట్ పెట్టారు కాబట్టే ‘తండేల్’ సక్సెస్‌కి మించిన ప్రశంసలు ఆయన నటనకి వస్తున్నాయి. ‘తెనాలి రామకృష్ణ’ క్యారెక్టర్‌లో కూడా ఆయన అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వగలరు. అలాంటి సినిమా ఆయన చేయాలని దర్శకుడిగా, అలాగే స్నేహితుడిగా నా కోరిక. నా తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ‘కార్తికేయ 3’ కథ రెడీ అవుతోంది. ఈ లోపు ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. సూర్యగారితో ఓ సినిమాకు చర్చలు నడుస్తున్నాయి.

ఇది కూడా చదవండి:

Balakrishna: థమన్‌కు బాలయ్య కాస్ట్‌లీ గిఫ్ట్.. ఊహించలేదు కదా!

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు