Balakrishna: నటసింహం బాలయ్య తనకు నచ్చిన వారి పట్ల చూపించే ప్రేమ వేలల్లో కాదు.. టన్నుల్లో ఉంటుంది. ఆ విషయం ఇప్పటికే పలు సందర్భాలలో నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి బాలయ్య ప్రేమ ఎలా ఉంటుందో.. ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ కలిగింది. తన సినిమాలంటే చాలు రెడ్ బుల్ తాగిన వాడిలా రెచ్చిపోయే థమన్‌కు ఆయన ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ని బహుమతిగా ఇచ్చి.. థమన్ అంటే తనకు ఎంత స్పెషలో తెలియజేశారు. ఇంతకీ థమన్‌కి బాలయ్య ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
‘జైలర్’ సినిమా టైమ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు, దర్శకుడు నెల్సన్‌కు, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు నిర్మాణ సంస్థ కాస్ట్‌లీ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోనూ ఇలా కారును గిఫ్ట్‌గా పొందిన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ ఫస్ట్ టైమ్, టాలీవుడ్‌లో ఓ సంగీత దర్శకుడు కారును బహుమతిగా, అందులోనూ హీరో చేతుల మీదుగా అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. మ్యాటర్ అర్థమైంది కదా..
Also Read- Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది.. ఎంత క్యూట్‌గా ఉందో!
అవును.. సంగీత దర్శకుడు థమన్‌కు నటసింహం బాలయ్య ఖరీదైన పోర్షే (Porsche Car) కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. హైదరాబాద్‌లోని క్యాన్సర్ హాస్పిటల్‌లో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బాలయ్య.. థమన్ పట్ల తన ఆనందాన్ని, ప్రేమను తెలియజేశారు. ‘‘థమన్ నాకు తమ్ముడితో సమానం. నాకు వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన థమన్‌కి ప్రేమతో కారుని బహుమతిగా ఇచ్చాను. ఫ్యూచర్‌లోనూ మా జర్నీ ఇలాగే కొనసాగుతుంది’’ అని బాలయ్య ఈ వేడుకలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం థమన్‌కు బాలయ్య గిఫ్ట్‌గా కారును ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక బాలయ్య – థమన్ కాంబినేషన్ విషయానికి వస్తే.. ఫస్ట్ బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ‘అఖండ’ నుంచి వరసగా బాలయ్య చేసిన ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాలకు థమనే సంగీతం అందిస్తూ వస్తున్నారు. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేసి, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. రాబోయే బాలయ్య సినిమా ‘అఖండ 2: తాండవం’ సినిమాకు కూడా థమనే సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. సంగీత దర్శకుడికి కారుని బహుమతిగా ఇచ్చి, టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు బాలయ్య శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు.