Janhvi Kapoor
ఎంటర్‌టైన్మెంట్

Janhvi Kapoor X Pa. Ranjith: శభాష్.. బోల్డ్ స్టెప్ వేసిన జాన్వీ

Janhvi Kapoor X Pa. Ranjith: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్‌లో పాగావేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ‘దేవర’తో టాలీవుడ్‌లోగ్రాండ్ డెబ్యూ చేసినా.. విమర్శకుల నుండి ప్రశంసలు పొందలేకపోయింది. అయితే జాన్వీ తనని జస్ట్ గ్లామర్, కమర్షియల్ హీరోయిన్‌గా మాత్రమే ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్ట పడట్లేదని తెలుస్తోంది. అవును.. మరి అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అంటే అలానే ఉండాలి. శ్రీదేవి అందమే కాదు నటన కూడా ఉన్నత శిఖరం. ఈ నేపథ్యంలోనే జాన్వీ తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకు జాన్వీ ఏం చేసిందంటే..

డెబ్యూనే ‘ధ‌డ‌క్’ వంటి సాలిడ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ముందుకు వచ్చిన జాన్వీ.. ఇండస్ట్రీలోకి ఏ ఉద్దేశంతో వచ్చిందో అర్ధం చేసుకోవాలి. మధ్యలో ‘మిలి’ వంటి సర్వైవర్‌ థ్రిల్లర్‌ సినిమాతో తాను వర్సటైల్ అని ప్రూవ్ చేసుకున్నా.. ఆడియెన్స్ మదిలో ఆమె ఒక పరిపక్వత చెందిన నటి అనిపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మరో బోల్డ్ స్టెప్ వేసింది. ‘కబాలి, కాలా, సార్పట్ట పరంపర, తంగలాన్’ వంటి యూనిక్ సినిమాలు తెరకెక్కించిన కోలీవుడ్ డైరెక్టర్ పా. రంజిత్ తో కొలాబరేట్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఆయన కేవలం దర్శకుడిగానే కాకుండా ‘పరియేరుమ్ పెరుమాళ్’(Pariyerum Perumal) వంటి చిత్రాలను నిర్మించాడు కూడా. ఆయన మరోసారి నిర్మాత అవతారమెత్తి నెట్‌ఫ్లిక్స్(Netflix) కోసం ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు రెడీ అయ్యాడు. దీనిలో జాన్వీ లీడ్ గా నటించనుండటం విశేషం.

విమర్శలు అన్ని అక్కడే

దళిత వివక్ష అనే కథాంశాలతోనే పా. రంజిత్ అసోసియేట్ కావడం పలువురు సినీ అభిమానులకు బోర్ కొడుతుంది. ఇప్పుడు జాన్వీని కూడా అలాంటి పాత్రలో చూపిస్తే తట్టుకోలేం అంటున్నారు కొందరు. అసలే బ్రాహ్మణ అమ్మాయి.. పోయి పోయి వీడి చేతిలో పడింది ఏంటి రా అనే కామెంట్స్‌ని ఈ కొలాబరేషన్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టుల కింద కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మరికొందరు సినీ అభిమానులు మాత్రం పా. రంజిత్ క్రాఫ్ట్ మ్యాన్ షిప్‌కు అభిమానం చూపిస్తున్నారు. జాన్వీ బోల్డ్ స్టెప్‌ను మెచ్చుకుంటున్నారు.

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?