Megastar Chiranjeevi in Vishwambhara
ఎంటర్‌టైన్మెంట్

Vishwambhara: మెగాస్టార్‌తో మేనల్లుడు.. ‘విశ్వంభర’ తాజా అప్డేట్ ఇదే!

Vishwambhara Update: నందమూరి కళ్యాణ్ రామ్‌తో చేసిన ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన మల్లిడి వశిష్ట.. తన తదుపరి చిత్రంగా తను ఎంతో అభిమానించే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో ‘విశ్వంభర’ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్‌పై వచ్చిన ట్రోలింగ్‌తో మళ్లీ కొన్ని మార్పులు చేస్తున్నారనేలా టాక్ వినబడుతూ వచ్చింది. అందుకే ‘విశ్వంభర’కు లాక్ చేసిన డేట్‌ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’కు కేటాయించారు. సినిమా షూటింగ్ అంతా పూర్తయిందని ఎప్పుడో ప్రకటించిన ‘విశ్వంభర్’ టీమ్.. ఆ తర్వాత రిలీజ్‌పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ‘విశ్వంభర’కు సంబంధించి మేకర్స్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

Also Read- Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది.. ఎంత క్యూట్‌గా ఉందో!

సాంగ్ షూట్‌కి సిద్ధమైన చిరు
ఆ ప్రకటన ఏమిటంటే.. శోభి మాస్టర్ కొరియోగ్రఫీలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ షూట్ జరుగుతుందని, ఈ సాంగ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌లా ఉంటుందని, ఇందులో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్, గ్రేస్ హైలెట్ అయ్యేలా సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి అదిరిపోయే ట్యూట్ రెడీ చేసినట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. మరి సాంగ్స్ షూట్ చేస్తున్నారంటే.. టాకీ పార్ట్ షూట్ మొత్తం పూర్తయ్యే ఉంటుందని అనుకోవచ్చు. ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయో, వాటిని ఎప్పుడు చిత్రీకరిస్తారో తెలియదు కానీ.. ఈ బ్యాలెన్స్ షీట్ చూస్తుంటే, ఇప్పుడప్పుడే ‘విశ్వంభర’ థియేటర్లలోకి వచ్చే అవకాశం అయితే లేదు అన్నట్లుగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. చిత్ర విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ ఇస్తే తప్ప.. ఈ వార్తలు ఆగేలా లేవు.

మెగాస్టార్‌తో సుప్రీమ్ హీరో!
‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌తో కలిసి మేనల్లుడు సాయి దుర్గ తేజ్ కూడా కనిపించబోతున్నారట. అది.. సీన్‌లోనా, లేదంటే సాంగ్‌లోనా అనేది తెలియదు కానీ, పెద మామయ్యతో ఈ మెగా మేనల్లుడు నటించబోతున్నాడంటూ టాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే చినమామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సాయి దుర్గ తేజ్ ‘బ్రో’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘విశ్వంభర’ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. త్రిష, ఆషికా రంగనాథ్ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌కు విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు.

ఇవి కూడా చదవండి:

Balakrishna: థమన్‌కు బాలయ్య కాస్ట్‌లీ గిఫ్ట్.. ఊహించలేదు కదా!

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘వాలెంటైన్స్ డే’ సర్‌‌ఫ్రైజ్‌ చూశారా..

Janhvi Kapoor X Pa. Ranjith: శభాష్.. బోల్డ్ స్టెప్ వేసిన జాన్వీ

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు