Swetcha Effect (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కదిలిన ఫారెస్ట్ యంత్రాంగం.. అటవీ భూమి ఆక్రమణలకు చెక్!

Swetcha Effect: డెక్కన్ సిమెంట్ కంపెనీ అటవీ భూముల ఆక్రమణపై గతంలో స్వేచ్ఛ ఎక్స్ క్లూజివ్ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘అడవుల్లో అడ్డగోలు దందా’, ‘డెక్కన్ సిమెంట్ దందా గుర్తుందా?’ అంటూ వరుస కథనాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. భూ కబ్జాను అరికట్టి అటవీ భూములను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటవీశాఖను కోరింది. దీంతో డెక్కన్ సిమెంట్ కంపెనీ కబ్జా వ్యవహారం రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో తాజాగా దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించారు. సూర్యపేట జిల్లాలో కబ్జాకు గురైన అటవీ భూములను పరిశీలించి.. ఇందుకు కారణమైన డెక్కన్ సిమెంట్ కంపెనీపై చర్యలు చేపట్టేందుకు సమాయత్తమయ్యారు.


ప్రహారీ గోడ కూల్చివేత
సూర్యపేట జిల్లా పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ కంపెనీ.. తన ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న సైదుల్ నామా రిజర్వ్ డ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించినట్లు స్వేచ్ఛ తన ఎక్స్ క్లూజివ్ కథనాల్లో బట్టబయలు చేసింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో తాజాగా సూర్యపేట జిల్లా డీఎఫ్ఓ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం.. కబ్జాకు గురైన భూమిని పరిశీలించాలని నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న డెక్కన్ సిమెంట్ కంపెనీ నిర్వహకులు.. ఆక్రమించిన అటవీ భూమి చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్ ను తమంతట తామే స్వయంగా కూల్చివేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ దాడుల్లో తమ ఆక్రమణలు బయటపడి.. తమపై కేసులు పెడతారన్న భయంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా గోడను తొలగించింది.

వివాదానికి మూలం ఇదే
1986లో రోజుకు 350 టన్నుల కెపాసిటీతో ఏర్పాటైంది డెక్కన్ సిమెంట్స్ కంపెనీ. కానీ, ఇప్పుడు ఫారెస్ట్ భూములను కబ్జా చేసి 11 వేల టన్నులకు విస్తరించింది. ఫారెస్ట్ చట్టాలను పార్లమెంట్ కఠినంగా మార్చుతూ వస్తున్నా డెక్కన్ సిమెంట్స్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలను మేనేజ్ చేస్తూ 700 ఎకరాలకు విస్తరించి కేంద్ర ప్రభుత్వ చట్టాలను తుంగలోకి తొక్కింది. ఎన్ని వందల కోట్లు పెట్టినా, తయారు చేసుకోలేని ఫారెస్ట్ భూములను బొందల గడ్డల్లా మార్చేసింది. పాత మైనింగ్‌ తవ్వకాలను పూడ్చాకే, కొత్త మైనింగ్ తీసుకుంటామని హామీ ఇచ్చి మాయ చేయడం డెక్కన్‌కు వెన్నతో పెట్టిన విద్య. సూర్యాపేట జిల్లా మహంకాళి గూడెంలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ తర్వాత సైదుల్ నామా ఫారెస్ట్ ఏరియా కంపార్ట్మెంట్ జోన్ 26, 27లో సున్నం రాయి తవ్వకాలతో కొనసాగిన విధ్వంసం అంతా ఇంతా కాదు.


మైనింగ్ లీజ్ మాఫియా
2000లో 73.93 హెక్టార్స్ కంపార్ట్మెంట్ నెంబర్ 27లో సైదుల్ నామా రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. సుమారు 4 వేల ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇందులో మూడు దశలుగా 700 ఎకరాల పైనే డెక్కన్ సిమెంట్స్‌కి కేటాయించారు. సీఏ ల్యాండ్(కాంపన్సేటరీ ఎఫారిస్టేషన్) ప్రకారం ఎంత ల్యాండ్ తీసుకుంటే అంత ఫారెస్ట్‌కి ఇవ్వాలి. ఇది పూర్తి కాకుండానే ఫారెస్ట్ ల్యాండ్ కేటాయిస్తే అది చెల్లదని చట్టం (ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్స్)లో స్పష్టంగా ఉంది. అయితే, గుర్రంబోడు సర్వే నెంబర్ 540లో 43 హెక్టార్స్ డెక్కన్ సిమెంట్స్‌కి ఉన్నట్లు ఫేక్ జీపీఏ పేపర్స్ సృష్టించారు. ల్యాండ్ ఉందా లేదా అని చూడకుండానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేపర్స్ పైనే మ్యూటేషన్ చేసుకుంది. నాగార్జున సాగర్ ముంపు బాధితులకి ఫారెస్ట్ ల్యాండ్స్‌ని డీ1 పట్టాల భూములుగా చేర్చుతూ కొత్త సర్వే నెంబర్ 540ని క్రియేట్ చేసింది. దానిని నాన్ ఫారెస్ట్‌గా ఇచ్చారు. ఈ సర్వే నెంబర్‌పై మొత్తం 6 వేల 500 ఎకరాలు ఇస్తే, ప్రస్తుతం 14వేల ఎకరాలకు పైగా దొంగ పట్టాలు ఉన్నాయి.

కబ్బా భూములకు అనుమతులు
90 ఎకరాల్లో 1500 కోట్ల సామాగ్రి ఉండే సిమెంట్ ఫ్యాక్టరీ, ఫవర్ ప్లాంట్‌ని నిర్మించారు. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొలేదు. వాళ్లు ఇవ్వలేదు. ప్లైయింగ్ స్క్వాడ్ 33 హెక్టార్స్ అక్రమించారని తేల్చగా, డీఎఫ్ఓ మాత్రం 8 హెక్టార్స్ ఉందని ఒప్పుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు 2015, 2016 మధ్య కాలంలో ఇచ్చామని, 2020 జూలై 1న ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. 10 నెలల వరకు ఎలాంటి రియాక్షన్ లేదు. దీని వెనుక, 200 కోట్ల వ్యవహారం నడించిందని, ఆనాటి జిల్లా మంత్రి నుంచి చేతులు మారాయని వినికిడి. 2021లో ఫ్రెష్‌గా రైల్వే స్టైడింగ్ కావాలని అందుకు ల్యాండ్‌ని రెగ్యులరైజ్ చేయాలని అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆ ప్రపోజల్ 4 రోజుల్లోనే ఆటవీ శాఖ, మిగితా అధికారులు అందరూ కలిసి అప్రూవల్ ఇచ్చేశారు. కబ్జా చేసిన ప్రాంతంలో చెట్లు లేవు. అటవీ భూమికి ఎలాంటి ఇబ్బందులు లేవని సెంట్రల్‌కి రికమండేషన్ ఇచ్చారు. ఆనాడు ఎన్విరాన్మెంట్ అధికారి అయిన ఆర్ శోభకు రిటైర్డ్ అయిన తర్వాత ఫారెస్ట్ అడ్వయిజరీ కమిటీలో ఛైర్మన్‌ పోస్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2023 మార్చిలో అక్రమంగా అక్రమించిన ఫారెస్ట్ భూమికి మొట్టమొదటి సారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనుమతులు తెచ్చుకున్నారు. ఈ అప్రూవల్ ఇన్ వాల్యుడ్ అని కొంతమంది మళ్లీ ఎన్జీటీలో కేసులు వేశారు.

Also Read: BRS Srinivas Goud: కల్తీ కల్లును ప్రోత్సహిస్తున్నదెవరు?.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

చట్టాలు ఏం చెబుతున్నాయి?
ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ 1980 ప్రకారం సెంట్రల్ భూమికి రాష్ట్రం కస్టోడియల్ మాత్రమే అని 1990లోనే పార్లమెంట్ చట్టం చేసింది. 1980 కంటే ముందే 75 సంవత్సరాలు కబ్జాలో ఉంటే వారికి భూమి ఇవ్వాలి. లేదంటే ల్యాండ్‌ని ఖాళీ చేయాల్సిందేనని రిజర్వ్డ్ ఫారెస్ట్ చట్టం కఠినంగా చెబుతోంది. అయితే, 2011లో కబ్జా చేసిన వారికి భూమి ఇవ్వడం ఏంటని సుప్రీంకోర్టు గతంలోనే వేరే కేసుల్లో తీర్పులు ఇచ్చింది. ఢిల్లీ ఎన్జీటీ ప్రిన్సిపాల్ జడ్జిమెంట్ ప్రకారం 10 వేల మంది నివాసం ఉండే ఢిల్లీలోని ఓ ఏరియాను మొత్తం ఖాళీ చేయించారు. రెగ్యులరైజేషన్ పూర్తి అయితే కేసులు వేయాలి. గతంలో కేసులు ఉండటంతో మళ్లీ ఎన్జీటీలో అప్పీల్ (27/2023) వేశారు. 26 సంవత్సరాలుగా మైన్ 2 కి చెందిన సీఏ పూర్తి చేయలేదు. ఇల్లీగల్‌గా 2 కోట్ల 60 లక్షల టన్నుల మైనింగ్‌ని తీశారు. నంబాపూర్ విలేజ్‌లో 1998 కంపార్ట్మెంట్ ప్రకారం అక్రమాలను కాగ్ ఎండగట్టింది.

Also Read This: Cinnamon benefits: దాల్చిన చెక్క.. తింటే బరువు తగ్గుతారు పక్కా.. నిపుణులు చెబుతోంది ఇదే!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం