Ahuja Family
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Sunil Ahuja: స్వేచ్ఛ చేతిలో సునీల్ అహుజా ఆస్తుల చిట్టా?

  • ఎంతోమంది చావుకు కారణమై సంపాదించిన సొమ్ము
  • వందల సంఖ్యలో బాధితులు.. వేల కోట్ల ఆస్తుల టోకరా
  • ఫైనాన్స్ ఇచ్చి ఆస్తులు రాయించుకున్న ఘనుడు
  • డబ్బులు తిరిగి ఇచ్చినా రిటర్న్ చేయకుండానే విదేశాలకు జంప్
  • కొడుకు అశీష్, కూతురు సిమ్రాన్‌తో కలిసి మోసాలు
  • తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితుల్లో టెన్షన్
  • విలువలో 30 శాతం అప్పుగా ఇచ్చి ఆస్తులు కొట్టేయడంతో రోడ్డుపాలు
  • రూ.10 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు అప్పులు
  • వేల కోట్ల ఆస్తులు గుప్పిట్లో పెట్టుకున్న సునీల్ అహుజా కుటుంబం
  • స్వేచ్ఛ చేతిలో బయటపడలేని బాధితుల ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఎడిటర్


Sunil Ahuja: అప్పుల రూపంలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న అహుజా ఫ్యామిలీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చారు, ఏ భూమి ఏ డాక్యుమెంట్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ అయింది, ఆ తర్వాత ఎంత సొమ్ము చెల్లించారు, అనుకున్నట్లు వడ్డీతో పాటు చెల్లించినా మళ్లీ బారు వడ్డీలు, చక్ర వడ్డీలు వేస్తూ ఆస్తి బహిరంగ మార్కెట్‌లో ఉన్న మొత్తానికి సమానంగా వసూలు చేసుకున్నారు. అయినా తిరిగి ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఇవ్వడంలో బ్యాంకు నుంచి ట్రాన్స్‌ఫర్ చేయడం, తీసుకోవడం నగదు రూపంలో ఉండడంతో వేల కోట్ల భూములు ఇట్లే తన వశం అయిపోయాయి. ఆ ఆస్తులను కాపాడుకోవడానికి అధికార యంత్రాంగంలో కీలకంగా ఉన్న తన సొంత పనివారిని వాడుకున్నాడు. తాజాగా ఈడీ హవాలా డబ్బుల వ్యవహారంపై దృష్టి పెట్టడంతో కుమారుడు అశీష్ కుమార్ అహుజా, కూతురు సిమ్రాన్‌తో కలిసి దేశం నుంచి సునీల్ అహుజా పరారయ్యాడు.

ఇవి 10 శాతం ఆస్తులు మాత్రమే..


సునీల్ కుమార్ అహుజా ఆస్తుల్లో స్వేచ్ఛ చేతికి చిక్కినవి 10 శాతం మాత్రమే. ఇంకా 90 శాతం ఆస్తులు వివిధ బినామీ కంపెనీలపై , ఫర్మ్స్ పై పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. నగదు లేదని బ్యాంకు నుంచి బదిలీ చేస్తే ఏఏ అకౌంట్‌కు ఎంతెంత మొత్తం పంపించారు, ఆ కంపెనీలకు ఈ సునీల్ కుమార్ అహుజా కుటుంబానికి ఉన్న సంబందం ఏంటో మరో ఎక్స్‌క్లూజివ్ కథనంలో మీ ముందు స్వేచ్ఛాయుతంగా ఉంచుతాం.

వివాదాలకు కేరాఫ్‌గా ఆస్తులు

30 శాతం అప్పుతో పేపర్ల మీదనే ఆస్తి తన పేరుకి మార్చుకున్నాడు సునీల్. పొజిషన్ మాత్రం అప్పు తీసుకున్న వారే ఉంటారు. దీంతో లీగల్‌గా సమస్యలు తలెత్తుతున్నాయి. వివాదాలకు దారి తీస్తున్నాయి. శంకర్ పల్లిలో పొజిషన్‌లో ఉన్న భూమిలో గురువారం అహుజా మనుషులమని కొంతమంది వచ్చారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళితే రివర్స్‌గా అతని పైనే కేసు నమోదు చేశారు. ఎంతో మందిని మోసం చేసిన అహుజా ఇంకా తన మనుషులు షాడో లాగా పని చేస్తున్నారు. ఉమా మహేష్, అన్వర్ అనే వ్యక్తులు అహుజా తరుఫున ఫిర్యాదు చేయగానే గంటలోనే ఎఫ్‌ఐఆర్ చేశారు. 5 ఏండ్లుగా పొజిషన్‌లో ఉండి, అప్పుగా మాత్రమే అమ్మినందుకు పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయకుండానే కేసులు పెడుతున్నారు. దీంతో భూమి వద్ద పంచనామాలు చేయడం, పొజిషన్ ఎవరు ఉన్నారో కూడా తెలుసుకోకుండానే అహుజా కాసులకు కక్కుర్తి పడి కొంతమంది అతను పరారీ అయినా ఆ ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నారని తెలుస్తున్నది. అయితే, పేపర్‌లో కరెక్ట్ గానే ఉన్నట్లు కనిపించినా, మోసం జరిగిన తీరుపై ప్రభుత్వం స్పందించాలని, నిజ నిర్ధారణ, హవాలాపై నిగ్గు తేల్చి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Read Also- Kapil Sharma Cafe: మళ్లీ కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పుల మోత.. 25 రౌండ్లు కాల్పులు! వారి పనే!

యజమాని         డాక్యుమెంట్ – నెంబర్     ఎస్ఆర్‌ఓ     తీసుకున్నవారు    ప్రాపర్టీ ధర      లోన్(తీసుకున్నది)       లోన్(కట్టినది)

ఆశిష్ అహుజా        ఏజీపీఏ – 17812/2021     మహేశ్వరం     ఏఎంఆర్           రూ.50 కోట్లు
ఆశిష్ అహుజా        ఏజీపీఏ – 17813/2021     మహేశ్వరం     ఏఎంఆర్           రూ.50 కోట్లు

సునీల్ అహుజా      సేల్ డీడ్ – 2185/2014    ఎస్ఆర్ నగర్    ఓ హాస్పిటల్     రూ.50 కోట్లు        రూ.11 కోట్లు            రూ.35 కోట్లు
సిమ్రాన్ అహుజా     సేల్ డీడ్ – 1175/2015     ఎస్ఆర్ నగర్   ఓ హాస్పిటల్
సిమ్రాన్ అహుజా     సేల్ డీడ్ – 1176/2015     ఎస్ఆర్ నగర్   ఓ హాస్పిటల్
సిమ్రాన్ అహుజా      సేల్ డీడ్ – 1177/2015    ఎస్ఆర్ నగర్    ఓ హాస్పిటల్
సిమ్రాన్ అహుజా      సేల్ డీడ్ – 1178/2015    ఎస్ఆర్ నగర్    ఓ హాస్పిటల్
సిమ్రాన్ అహుజా       సేల్ డీడ్ – 1179/2015    ఎస్ఆర్ నగర్   ఓ హాస్పిటల్

ఆశిష్ అహుజా         ఏజీపీఏ – 4860/2019      హిమాయత్ నగర్   తల్వార్ ఫ్యామిలీ   రూ.50 కోట్లు    రూ.25 కోట్లు     రూ.52 కోట్లు
ఆశిష్ అహుజా         ఏజీపీఏ – 4861/2019       హిమాయత్ నగర్   తల్వార్ ఫ్యామిలీ
ఆశిష్ సిమ్రాన్ ఎక్స్‌పోర్ట్స్   ఏజీపీఏ – 344/2020    హిమాయత్ నగర్   తల్వార్ ఫ్యామిలీ
ఆశిష్ సిమ్రాన్ ఎక్స్‌పోర్ట్స్    ఏజీపీఏ – 345/2020    హిమాయత్ నగర్   తల్వార్ ఫ్యామిలీ

ఆశీష్ అహుజా         సేల్ డీడ్ – 2896/2020    బంజారాహిల్స్       తల్వార్ ఫ్యామిలీ    రూ.50 కోట్లు

సునీల్ అహుజా       ఏజీపీఏ – 1722/2023        కూకట్ పల్లి           ఎస్ఎస్ఆర్               రూ.12 కోట్లు        రూ.3 కోట్లు       రూ.8 కోట్లు
సునీల్ అహుజా        ఏజీపీఏ – 3477/2023          రంగారెడ్డి             వీఆర్‌కే                      రూ.5 కోట్లు
ఆశిష్ అహుజా          సేల్ డీడ్ – 1900/2020          చేవెళ్ల                    *                            రూ.10 కోట్లు
సర్వాంగ ఇన్ఫ్రాటెక్   సేల్ డీడ్ – 2081/2023       గండిపేట్               *                            రూ.50 కోట్లు
సునీల్ అహుజా           సేల్ డీడ్ – 12321/2006         రంగారెడ్డి           *                             రూ.12 కోట్లు

సునీల్ అహుజా        ఏజీపీఏ – 1387/2008           చంపాపేట్           పీ నాయుడు             రూ.5 కోట్లు
సునీల్ అహుజా         సేల్ డీడ్ – 2246/2009         బంజారాహిల్స్      ఎస్ దేవి                 రూ.25 కోట్లు

ఏఏఎస్‌ఏ ప్రాపర్టీస్    ఏజీపీఏ – 8430/2022      రంగారెడ్డి            కేదార్ + వీఎం  రూ.200 కోట్లు      రూ.40 కోట్లు    రూ.95 కోట్లు + 4కేజీల బంగారం
ఏఏఎస్‌ఏ ప్రాపర్టీస్     ఏజీపీఏ – 8431/2022        రంగారెడ్డి           కేదార్ + వీఎం
ఏఏఎస్‌ఏ ప్రాపర్టీస్      ఏజీపీఏ – 8432/2022       రంగారెడ్డి            కేదార్ + వీఎం
ఏఏఎస్‌ఏ ప్రాపర్టీస్       ఏజీపీఏ – 8433/2022       రంగారెడ్డి           కేదార్ + వీఎం
ఇన్ఫినిటీ ప్రాపర్టీస్      సేల్ డీడ్ – 6690/2018      బంజారాహిల్స్      కేదార్ + వీఎం

సునీల్ అహుజా    సేల్ డీడ్ – 4359/2008      గండిపేట్       ఓఎస్ఎస్‌పీ      రూ.400 కోట్లు       రూ.15 కోట్లు      రూ.75 కోట్లు
ఆశిష్ అహుజా      సేల్ డీడ్ – 1075/2024     మేడ్చల్ ఆర్ఆర్       రూ.4 కోట్లు      రూ.2 కోట్లు       రూ.3.5 కోట్లు
ఆశిష్ అహుజా       సేల్ డీడ్ – 6946/2023       మేడ్చల్ ఆర్ఆర్       రూ.40 కోట్లు       రూ.3.5 కోట్లు        రూ.5 కోట్లు
ఆశిష్ + సునీల్      ఏజీపీఏ – 6588/2021       ఎల్బీ నగర్ బీఆర్       రూ.20 కోట్లు       రూ.6 కోట్లు        రూ.9 కోట్లు
ఆశిష్ అహుజా       సేల్ డీడ్ – 3276/2023      కూకట్ పల్లి        ఎల్ఆర్      రూ.8 కోట్లు       రూ.2 కోట్లు        రూ.3 కోట్లు

ఎస్ఏఏఎస్ఏ విల్లా     ఏజీపీఏ – 6935/2022      రంగారెడ్డి       మంజీరా కన్‌స్ట్రక్షన్     రూ.250 కోట్లు    రూ.50 కోట్లు     రూ.75 కోట్లు
ఎస్ఏఏఎస్ఏ విల్లా     ఏజీపీఏ – 6936/2022    రంగారెడ్డి        మంజీరా కన్‌స్ట్రక్షన్
ఎస్ఏఏఎస్ఏ విల్లా     ఏజీపీఏ – 6937/2022     రంగారెడ్డి      మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా          సేల్ అగ్రిమెంట్ – 429/2022     ఎస్ఆర్ నగర్   మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా       సేల్ అగ్రిమెంట్ – 426/2022    ఎస్ఆర్ నగర్   మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా       సేల్ అగ్రిమెంట్ – 427/2022      ఎస్ఆర్ నగర్   మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా        సేల్ అగ్రిమెంట్ – 428/2022     ఎస్ఆర్ నగర్   మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా         సేల్ అగ్రిమెంట్ – 430/2022    ఎస్ఆర్ నగర్   మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా          సేల్ అగ్రిమెంట్ – 431/2022    ఎస్ఆర్ నగర్   మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా         సేల్ అగ్రిమెంట్ – 432/2022    ఎస్ఆర్ నగర్   మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా         సేల్ అగ్రిమెంట్ – 11280/2021    కూకట్ పల్లి   మంజీరా కన్‌స్ట్రక్షన్
సునీల్ అహుజా          సేల్ అగ్రిమెంట్ – 5942/2022    కూకట్ పల్లి    మంజీరా కన్‌స్ట్రక్షన్

సర్వగ్న ఇన్ఫ్రాటెక్    ఏజీపీఏ – 4287/2023    కూకట్ పల్లి   వోల్వో కార్ డీలర్   రూ.6 కోట్లు   రూ.3.5 కోట్లు   రూ.5 కోట్లు

సునీల్ అహుజా      సేల్ డీడ్ – 624/2023    ధరణి – శంకర్‌పల్లి    ఎండీ ఫార్మ్    రూ.160 కోట్లు   రూ.25 కోట్లు   రూ.52 కోట్లు
సునీల్ అహుజా      సేల్ డీడ్ – 625/2023    ధరణి – శంకర్‌పల్లి    ఎండీ ఫార్మ్

ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్    ఏజీపీఏ – 1150/2021      మేడ్చల్             *            రూ.150 కోట్లు       రూ.25 కోట్లు       రూ.78 కోట్లు

ఆశిష్ అహుజా        సేల్ డీడ్ – 3496/2021       శంకర్‌పల్లి        ఎస్ ఫరీద్         రూ.50 కోట్లు        రూ.5.7 కోట్లు      రూ.17 కోట్లు
ఆశిష్ అహుజా         సేల్ డీడ్ – 1445/2021        ధరణి – శంకర్‌పల్లి         ఎస్ ఫరీద్
ఆశిష్ అహుజా         సేల్ డీడ్ – 1446/2021        ధరణి – శంకర్‌పల్లి        ఎస్ ఫరీద్
ఆశిష్ అహుజా          సేల్ డీడ్ – 1628/2021       ధరణి – శంకర్‌పల్లి         ఎస్ ఫరీద్

సునీల్ అహుజా         ఏజీపీఏ – 2707/2021      రంగారెడ్డి     *        రూ.10 కోట్లు
ఏఎస్ లీజింగ్ ఫైనాన్స్       సేల్ డీడ్ – 5003/2021       పూణె       *       రూ.5 కోట్లు

ఏఎస్ లీజింగ్ ఫైనాన్స్       సేల్ డీడ్ – 19660/2021       రంగారెడ్డి       సాహితీ       రూ.65 కోట్లు
ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్       సేల్ డీడ్ – 21403/2019       రంగారెడ్డి       సాహితీ

సర్వగ్న ఇన్ఫ్రాటెక్       సేల్ డీడ్ – 2476/2023 ధరణి – శంకర్‌పల్లి ఎస్ సరెన్ రూ.45 కోట్లు రూ.5 కోట్లు రూ.8 కోట్లు
సర్వగ్న ఇన్ఫ్రాటెక్       సేల్ డీడ్ – 96/2025 ధరణి – శంకర్‌పల్లి ఎస్ సరెన్

సునీల్ అహుజా       సేల్ డీడ్ – 12464/2024       రంగారెడ్డి       భారతి బిల్డర్స్       రూ.250 కోట్లు       రూ.42 కోట్లు       రూ.102 కోట్లు
సునీల్ అహుజా       ఏజీపీఏ – 46/2021       రంగారెడ్డి       భారతి బిల్డర్స్
సర్వగ్న ఇన్ఫ్రాటెక్       సేల్ డీడ్ – 4591/2024       పటాన్ చెరు       భారతి బిల్డర్స్
సునీల్ అహుజా       సేల్ డీడ్ – 14364/2023       పటాన్ చెరు       భారతి బిల్డర్స్
ఆశీష్ అహుజా       సేల్ డీడ్ – 14363/2023       పటాన్ చెరు       భారతి బిల్డర్స్
సునీల్ అహుజా       సేల్ డీడ్ – 14365/2023       పటాన్ చెరు       భారతి బిల్డర్స్
సునీల్ అహుజా       సేల్ డీడ్ – 11842/2023       మేడ్చల్       భారతి బిల్డర్స్
సునీల్ అహుజా       సేల్ డీడ్ – 11841/2023       మేడ్చల్       భారతి బిల్డర్స్
సునీల్ అహుజా       సేల్ డీడ్ – 11839/2023       మేడ్చల్       భారతి బిల్డర్స్
సునీల్ అహుజా       సేల్ డీడ్ – 11840/2023       మేడ్చల్       భారతి బిల్డర్స్
ఏఎస్ లీజింగ్ ఫైనాన్స్       సేల్ డీడ్ – 11838/2023       మేడ్చల్       భారతి బిల్డర్స్
సర్వగ్న ఇన్ఫ్రాటెక్       సేల్ డీడ్ – 11836/2023       మేడ్చల్       భారతి బిల్డర్స్
ఏఎస్ లీజింగ్ ఫైనాన్స్       సేల్ డీడ్ – 11837/2023       మేడ్చల్       భారతి బిల్డర్స్

సునీల్ అహుజా       ఏఓఎస్ – 4517/2003       విశాఖ       ఆర్‌కేఆర్       రూ.కోటి       రూ.20 కోట్లు
సునీల్ అహుజా       బ్యాంక్ గ్యారెంటీ       *       పీఆర్       రూ.100 కోట్లు
సునీల్ అహుజా       బ్యాంక్ గ్యారెంటీ       *       ఎస్ఆర్       రూ.13 కోట్లు
సునీల్ అహుజా       బ్యాంక్ గ్యారెంటీ       *       వీఏ       రూ.6 కోట్లు
సునీల్ అహుజా       డాక్యుమెంట్స్       *       టీఎన్ఆర్       రూ.20 కోట్లు
సునీల్ అహుజా       *       *       వీఎస్‌డీ       రూ.20 కోట్లు

Read Also- Medical Students Drugs: మెడికోస్ గంజాయి మత్తులో.. కోటిన్నర టర్నోవర్ కలిగిన మహిళా పెడ్లర్ అరెస్ట్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం