Telugu heroines: భారత దేశంలో ఏ భాషకు సంబంధించిన హీరోలు అక్కడే తమ ఆధిపత్యం కొనసాగిస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి వుడ్ లోనూ హీరోలు అదే భాషకు సంబంధించిన వారుగా ఉంటారు. తెలుగులో తప్పితే మిగతా అన్ని భాషల పరిశ్రమల్లో హీరోయిన్లు కూడా దాదాపు అక్కడివారై ఉంటారు. టాలీవుడ్ లోకి వచ్చేసరికి ఆ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉంటుంది. తెలుగు హీరోయిన్ లను తప్పితే అందరినీ టాలీవుడ్ ఆదరిస్తుంది. ఈ సాంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. మన తెలుగు సినిమాల స్క్రీన్‌పై హీరోలు మెరిసిపోతున్నారు. చిరంజీవి, బాలయ్య, మహేష్, పవన్, రామ్ చరణ్… అందరూ మన తెలుగు మట్టి వాసనతో పుట్టుకొని, పెరిగి, ప్రపంచవ్యాప్తంగా మన గర్వాన్ని మెరిపించారు. కానీ, హీరోయిన్ల విషయానికి వస్తే? సాయి పల్లవి (కేరళ), పూజా హెగ్డే (కర్ణాటక), రష్మిక (కర్ణాటక), సమంత (తమిళనాడు)… పక్కరాష్ట్రాలు, మరో మూలాల నుంచి వచ్చి మన సినిమాల్లో రాణిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) హీరోయిన్లు ఎందుకు రావడం లేదు? వారి కోసం పక్కకు వెళ్లాల్సిందా? అన్నదాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Read also-Mass Jathara collection: రవితేజ ‘మాస్ జాతర’ రెండో రోజు కలెక్షన్లు ఎంత వచ్చాయంటే..
ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్) కాలంలో టాలీవుడ్‌లో హీరోయిన్లు 90% తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉండేవారు. విజయశాంతి, సుమలత, రోజా, సౌందర్య… వీళ్లు మన తెలుగు కథానయికలు. కథకి తగ్గట్టుగా కీలకమైన పాత్రలు చేసి, సినిమాలను సక్సెస్ చేశారు. కానీ, 90లు, 2000ల తర్వాత మార్పు వచ్చింది. హీరో సెంటర్డ్ మసాలా సినిమాలు డోమినేట్ అవ్వడంతో, హీరోయిన్ల పాత్రలు ‘గ్లామర్ షో’గా మారాయి. ఐటమ్ సాంగ్స్, లిప్‌లాక్ సీన్స్, షార్ట్ డ్రెస్‌లు… ఇవి టాలీవుడ్ డిమాండ్ గా మారాయి. ఫలితంగా, తెలుగు కుటుంబాలు తమ అమ్మాయిలను ఈ ఫీల్డ్‌లోకి అనుమతించడం మానేశాయి.
తెలుగు కుటుంబాలు అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్‌పై, స్నేహితులపై ఎక్కువ ఆంక్షలు పెడుతుంటారు. అందుకు ఎవరూ సినిమాల్లోకి రావడానికి ఇష్టపడరు. అందులోనూ సినిమా అంటే? ‘గ్లామర్, షార్ట్ కెరీర్’ అని భయపడతారు. రెడ్డిట్ డిస్కషన్‌లో ఒక యూజర్ చెప్పినట్టు, “తెలుగు కుటుంబాలు హీరోయిన్లుగా చేస్తే పెళ్లి అవదని, రకరకాల అపోహలతో యువతులకు కథా నియిక అవ్వాలనే ఆలోచనను చంపేస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో అమ్మాయిలు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. వాళ్లు గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీ, కానీ తెలుగు అమ్మాయిలు కల్చరల్ వాల్యూస్ కోసం అలా చేయడానికి ఇష్టపడరు. ఫలితంగా తెలుగు అమ్మాయిలు సినిమాలకు దూరం అవుతారు. అంతే కాకుండా సినిమా పరిశ్రమలో అమ్మాయిలను ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ‘చీప్’గా చూస్తారు! ఫెయిర్ స్కిన్, నాన్-లోకల్ అనే బయాస్ ఉంది. ఫలితంగా, రీతు వర్మ, ఈశా రెబ్బా లాంటి టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఛాన్స్‌లు పొందక, చిన్న పాత్రలకే పరిమితం అవుతున్నారు.
Read also-Baahubali The Epic: అదరగొడుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతంటే?
అయితే, ఆశతో కూడిన విషయాలు కూడా ఉన్నాయి. అంజలి, మనసా వరణాసి లాంటి తెలుగు హీరోయిన్లు సక్సెస్ స్టోరీస్. పాన్ ఇండియా సినిమాలు (RRR, పుష్ప)తో మార్పు వస్తోంది. మంచి స్క్రిప్ట్‌లు, సబ్‌స్టాన్షియల్ రోల్స్ వస్తే, తెలుగు అమ్మాయిలు తిరిగి మన స్క్రీన్‌పై రాణిస్తారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు రిస్క్ తీసుకోవాలి. కుటుంబాలు మైండ్‌సెట్ మార్చాలి. లేకపోతే, మన సినిమాలు ‘పక్కరాష్ట్రాల హీరోయిన్ల మార్కెట్’గా మిగులుతాయి! ఈ విషయం గురించి ఎవరో ఒకరు ముందు అడుగు వేయకపోతే చాల నష్టపోవాల్సి ఉంటుంది.
