Karmani: కొన్ని సినిమాలకు ప్రారంభోత్సవం అనేది చాలా సెంటిమెంట్‌గా ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్‌కు రారు. ఓపెనింగ్‌కు వస్తే ఆ సినిమా పోతుందనేది ఆయన అభిప్రాయం. అందుకే తను రాకుండా, తన ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరిని పంపిస్తారు. బాలయ్య తన సినిమాలకు తనే ముహూర్తం పెట్టుకుంటాడని, ఆ ముహూర్తానికి అన్నీ సెట్ కావాలని ముందే సూచిస్తాడనే నానుడి ఉంది. ఇలా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో సెంటిమెంట్ ఉంది. ఇప్పుడో దర్శకుడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు రమేష్ అనెగౌని (Ramesh Anegouni).
Also Read- Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై తీవ్ర ఒత్తిడి!
రమేష్ అనెగౌని దర్శకత్వంలో నాగ మహేష్ (Naga Mahesh), రూపాలక్ష్మి, బాహుబలి ప్రభాకర్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో.. రామారాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కర్మణి’. మంజుల చవన్, రమేష్‌గౌడ్ అనెగౌని నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం, హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానం (Filmnagar Daiva Sannidhanam)లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు నాగ మహేష్ క్లాప్ కొట్టగా, నిర్మాతలలో ఒకరైన మంజుల చవన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. (Karmani Movie Opening)
రమేష్ అనెగౌని 2022లో తెరకెక్కించిన ‘మన్నించవా..’ (Manninchavaa) చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా సినిమా ఇచ్చిన ఉత్సాహంతో, అదే టీమ్‌తో కలిసి ఈ ‘కర్మణి’ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు రమేష్ అనెగౌని మాట్లాడుతూ.. ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభోత్సవం జరిగే సినిమాలు సూపర్ హిట్ కొడతాయనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడీ సెంటిమెంట్ మా ‘కర్మణి’ సినిమాకు కూడా ఉంటుందనే నమ్మకం ఉంది. సీనియర్ నటీనటులతో పాటు కొత్తవారు ఈ చిత్రంలో నటించనున్నారు. మే మొదటి వారంలో ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.
Also Read- Padutha Theeyaga: ఎలాంటి ‘పాడుతా తీయగా’.. ఎలా అయిపోయింది? వుయ్ మిస్ యు బాలు సార్!
ఫిలింనగర్ దైవసన్నిధానంలో మా ‘కర్మణి’ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుళ్ల ఆశీస్సులు మా సినిమాకు, టీమ్‌కు ఉంటాయని భావిస్తున్నాను. టాలెంట్ ఉన్న టీమ్‌తో సినిమా చేస్తున్నాం. ఇండస్ట్రీకి మా బ్యానర్ల నుంచి ఒక మంచి సినిమా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచి కాన్సెప్ట్‌తో దర్శకుడు రమేష్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. తప్పకుండా ప్రేక్షకుల ఆశీస్సులు మాకు ఉంటాయని భావిస్తున్నామని అన్నారు నిర్మాత మంజుల చవన్. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, చిత్రంలో నటించిన ఇతర తారాగణం పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు