Padutha Theeyaga Controversy
ఎంటర్‌టైన్మెంట్

Padutha Theeyaga: ఎలాంటి ‘పాడుతా తీయగా’.. ఎలా అయిపోయింది? వుయ్ మిస్ యు బాలు సార్!

Padutha Theeyaga: గత కొద్ది రోజులుగా సింగింగ్ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాన్ని చూసిన వారంతా.. అంటున్న మాట ఇదే. ‘‘ఎలాంటి ‘పాడుతా తీయగా’.. ఎలా అయిపోయింది? వుయ్ మిస్ యు బాలు సార్!’’ అంటూ అందరూ ద లెజెండ్ ఎస్పీ బాలు (SP Balu)ని గుర్తు చేసుకుంటున్నారు. అసలు ‘పాడుతా తీయగా’ అంటే ఒక దైవత్వం నిండి ఉన్నట్లుగా ఉండేది. బాలు సార్ ఉన్నప్పుడు బుల్లితెరపై ఎన్ని సింగింగ్ షో లు వచ్చినా, బీట్ చేయడానికి వీలులేనంత గొప్పగా ఆ షో నడిచింది. ఎస్పీ బాలు లేకపోయినా, ఆయన తనయుడు ఎస్పీబీ చరణ్ (SPB Charan) కూడా అదే స్థాయిలో షో ని నడుపుతాడని అంతా అనుకున్నారు. ఎస్పీ బాలు ఉన్నప్పుడు ఈ షోకు ఒక్కరు మాత్రమే న్యాయ నిర్ణేతగా వచ్చేవారు. అదీ కూడా ఎంతో అనుభవజ్ఞులని ఈ షోకి జడ్జిగా తీసుకొచ్చేవారు. వారానికో న్యాయ నిర్ణేత మారుతూ ఉండేవారు. అందుకే, ఆయన ఉన్నప్పుడు ఈ షో ఓ వెలుగు వెలిగింది.

అలాగే ఈ ‘పాడుతా తీయగా’ షోని అప్పట్లో ఈటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేది. ఎందరో సింగర్స్ ఈ షో ద్వారా స్టార్ సింగర్స్ అయ్యారు. ఒకరిద్దరు కాదు, సింగింగ్ ఇండస్ట్రీకి టాలెంటెడ్ సింగర్స్‌ని ఇచ్చిన ఘనత మాత్రం ఈ షోకే దక్కుతుంది. ఎస్పీ బాలు అలా ట్రైన్ చేసి పంపించేవారు. ఆయన ఈ షోలో పాటలు పాడటానికి వచ్చే పిల్లలకు ఇచ్చే సలహాలు, సూచనలు తల్లిదండ్రులకు కూడా ఎంతగానో నచ్చేవి. ఈ షో చూసే తల్లిదండ్రులు వారి పిల్లలను సింగింగ్ ఇండస్ట్రీకి పంపించడానికి ఎంతో ఇష్టపడేవారు. అలా ‘పాడుతా తీయగా’ అంటే ఒక బ్రాండ్‌‌గా మారింది. కానీ ఇప్పుడా బ్రాండ్‌కు బీటలు పడ్డాయి. ఈ బ్రాండ్‌ని బజార్లో పెట్టేశారు. గత కొన్ని రోజులుగా ఈ షో పై జరుగుతున్న ఆరోపణలు, వివాదాలు ఈ షో ని ఇష్టపడే వారందరినీ నిరాశకు గురి చేస్తున్నాయి.

Also Read- Ghaati: ఏప్రిల్ 18 రిలీజ్ అన్నారు.. ఇంకెప్పుడు? ఈ ప్రాజెక్ట్‌లో అయినా క్రిష్ ఉన్నాడా?

నిజంగా అదే జరుగుతుందా?
సింగర్ ప్రవస్తి లేవనెత్తిన అంశాలతో ఈ షో ప్రస్తుతం వార్తలలో హైలెట్ అవుతుంది. బాడీ షేమింగ్, కుట్రలు, కుతంత్రాలు అంటూ సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) చేస్తున్న ఆరోపణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా న్యాయ నిర్ణేతలపై ఆమె చేస్తున్న ఆరోపణలు వింటుంటే.. ఈ షో‌లో ఇంత జరుగుతుందా? ఎలాంటి షో ని ఎలా మార్చేశారు? అంటూ కొందరు బాధపడుతున్నారు. ఎస్పీ బాలు‌కి నివాళిగా ఈ షోని ఆయన లేకపోయినా ముందుకు తీసుకెళ్లాలని యాజమాన్యం భావిస్తే, దీనిని కూడా అన్ని షో ల మాదిరిగానే మార్చేశారంటూ, ఈ షోని మొదటి నుంచి ఫాలో అయ్యేవారు కామెంట్స్ చేస్తుండటం విశేషం. అసలు నిజంగా ప్రవస్తి చెబుతున్నది ఈ షో లో జరుగుతుందా? లేదంటే, ఎలిమినేట్ అయినందుకు అలా ఆరోపణలు చేస్తుందా? అనేది క్లారిటీ అయితే లేదు.

పబ్లిసిటీ స్టంట్ కాదు కదా!
ఎస్పీ బాలు లేకుండా ఈ షోని నడిపించడం సాధ్యం కాదని మొదటి నుంచి యాజమాన్యం భావిస్తూనే ఉంది. ఆయన కుమారునితో, బాలుకి నివాళిగా నడిపించాలని ఫైనల్‌గా ఫిక్స్ అయ్యారు. అయితే రామోజీరావు ఉన్నంత వరకు ఈ షో‌పై ఎటువంటి ఆరోపణలు రాలేదు. బాలు లేకపోయినా కామ్‌గా ఈ షో నడుస్తూనే ఉంది. కానీ, ఈ మధ్యే ఇందులో కమర్షియల్ కోణం యాడయిందనేలా టాక్ వినిపిస్తోంది. అందుకే పోటీ ప్రపంచంలో నిలబడాలంటే, ఈ షో గురించి అంతా మాట్లాడుకునేలా చేయాలనే.. ఇలా పబ్లిసిటీ స్టంట్ లేవనెత్తారనేలా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విడ్డూరం. ఎందుకంటే, ఎస్పీ బాలు ఉన్నంత వరకు ఈ షోని కొట్టే సింగింగ్ షోనే లేదు. కానీ ఆయన తర్వాత ఈ షో రేటింగ్ దారుణంగా పడిపోయింది. అసలు ‘పాడుతా తీయగా’ ఇంకా నడుస్తుందా? అనుకునే స్టేజ్‌కి వెళ్లిపోయింది. అందుకే ఇలా ఆరోపణలతో పబ్లిక్‌లో అంతా మాట్లాడుకునేలా చేశారని అంటున్నారు.

Also Read- Samantha: విడాకులకు కారణం అదేనా? చైతూ చేసిన తప్పు ఇదేనా?

ఎలా నమ్మాలి?
సింగర్ ప్రవస్తి కాకుండా ఈ షో లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వారెవరూ కూడా ఇంత వరకు ఈ ఆరోపణలను సమర్ధించలేదు. దీంతో ప్రవస్తి చెబుతుంది నిజమేనా? అనేలా కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, సునీత (Singer Sunitha) వివాదాలకు దూరంగా ఉండే సింగర్. ఎప్పుడూ ఒకరిని ప్రోత్సహించే సింగరే కానీ, ఒకరిని తొక్కేయాలని చూసిన దాఖలాలు ఇప్పటి వరకు ఆమె హిస్టరీలో అయితే లేదు. ఆమె సంగతి అలా ఉంటే, ఆస్కార్ విజేతలు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani), చంద్రబోస్ (Chandrabose) వంటివారు ఇప్పటి వాళ్లు కాదు. వాళ్లు ఒక సింగర్‌ విషయంలో ఇంత దిగజారుడుతనంగా వ్యవహరిస్తారని అనుకోలేం. అందులోనూ చంద్రబోస్ చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ సరదాగా ఉంటారు తప్పితే, ఇలాంటి విషయాల్లో వేలు పెట్టరు. అందులోనూ ఎంతో ప్రతిష్టాత్మకమైన షో ఇది. అలాంటి షో విషయంలో వారు నీచాతినీచంగా ప్రవర్తించారంటే అస్సలు నమ్మలేం. వారు ఏదైనా చెప్పినా, అది సింగర్స్ మంచికే తప్పితే, వారిని ఏదో చేయాలని ఎందుకు అనుకుంటారు. అసలు ఎక్కడా లాజిక్కే దొరకడం లేదు. ఒక చిన్న సింగర్ విషయంలో ఇలా వారు వ్యవహరించి ఉంటారంటే, ఎవ్వరూ నమ్మడం లేదు. కచ్చితంగా ఇదేదో పబ్లిసిటీ స్టంటే అని అంతా అనుమానపడుతున్నారు. మరి అసలు విషయం ఏమై ఉంటుందో.. త్వరలోనే తెలిస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు