Samantha: స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని హీరో నాగ చైతన్య కలిసి ‘ఏ మాయ చేసావె’ అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి హిట్టయింది. ఆ సినిమా అప్పటి నుంచి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి, పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ జంట కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మరి ఏమైందో ఏమోగానీ, పెళ్లయిన నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. మేమిద్దరం అండర్‌స్టాండింగ్‌తోనే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అయితే వారు విడిపోవడానికి కారణం ఏమిటనేది మాత్రం ఇంత వరకు చెప్పలేదు. మరి ఫ్యామిలీ మెంబర్స్‌కి అయినా తెలుసో? లేదో? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
Also Read- Tollywood Heroine: అప్పుడు ఫేమస్ డెంటిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
ఇరు కుటుంబాల పెద్దలు కూడా వారు విడిపోతామని చెప్పినప్పుడు.. కొంత ఓపిక పట్టాలని సూచించినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటల ప్రకారం విడిపోయే ముందు వారిద్దరి మధ్య, రోజూ గొడవలు జరుగుతున్నాయనేది మాత్రం స్పష్టమైంది. ఒకే ఇంట్లో ఉండి చేతులకు కత్తులు ఇస్తే.. రక్తపాతాలు జరుగుతాయి అనేంతగా సమంత వారి మధ్య ఉన్న గొడవల గురించి చెప్పుకొచ్చింది. మరి ఈ గొడవలకు, అసలు వారు విడిపోవడానికి కారణం ఏమిటనేది మాత్రం ఇంత వరకు సమంతగానీ, చైతూగానీ బయటపెట్టలేదు. ఇకపై పెట్టే ఉద్దేశం కూడా వారికి లేదు.
ప్రస్తుతం నాగ చైతన్య మరో నటి శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకుని, హ్యాపీగా తన లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా ఈ మధ్య బాగానే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడితో ప్రస్తుతం ఆమె ప్రేమలో ఉందనేలా టాక్ అయితే బాగానే వినిపిస్తుంది. మరి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా? లేదా? అనేది చూడాలి. ఇక సమంత, చైతూ విడిపోవడానికి కారణాలు బయటికి రాకపోయినా, సమంత మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా వారి మధ్య జరిగిన విడాకులకు కారణం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంది. చైతూ ప్రవర్తన కారణంగానే విడిపోయామని చెప్పడానికి ట్రై చేస్తున్నట్లుగా అయితే ఆమె చెప్పే విషయాలను బట్టి అర్థమవుతుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో లైక్ చేసిన ఓ పోస్ట్‌ని చూసి, వారి విడాకులకు కారణం చైతూనే అని ఆమె స్పష్టం చేసిందనేలా టాక్ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Vijay Deverakonda: ‘ముత్తయ్య’కు రౌడీ సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?
సక్సెస్ వెర్స్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో పెళ్లి బంధాలు బలహీన పడటానికి కారణాలు ఏంటి? అనే ప్రశ్నతో సర్వే జరిగింది. ఆ సర్వే రిజల్ట్ ఇలా ఉన్నాయి. జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే, భార్యలు వారి భర్తలను వదిలేయాలని చూడటం లేదు కానీ, భర్తలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. భార్యలతో భావోద్వేగమైన బంధం లేకపోవడం కారణంగానే భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలినట్లుగా ఇన్‌స్టా ఖాతాలో సర్వే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ని సమంత లైక్ చేసింది. అంతే, దీనిని చైతూకి లింక్ చేస్తూ.. సమంత అనారోగ్యంతో ఉన్నప్పుడు చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఆమెతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ మిస్సయ్యాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేనా.. సమంత, చైతూ విడిపోవడానికి కారణం కూడా ఇదే అనేలా చర్చలు మొదలయ్యాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు