Vijay Deverakonda: ‘ముత్తయ్య’కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సపోర్ట్ చేశారు. ఏ ముత్తయ్య? ఏం సపోర్ట్ అనుకుంటున్నారా? కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ చిత్రం ‘ముత్తయ్య’ (Muthayya). భాస్కర్ మౌర్య దర్శకత్వంలో హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలో ఈటీవీ విన్‌లో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ వీక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు.
Also Read- Raashi Khanna: రాశీ ఖన్నా బికినీ ట్రీట్.. ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం, మరీ ఇలానా?
ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈటీవీ విన్‌లోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఓటీటీలోకి వచ్చే సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ చేయరు. కానీ ఈ సినిమా విషయంలో మేకర్స్ అస్సలు తగ్గడం లేదు. ఈటీవీ విన్‌లో ప్రీమియర్ కాబోయే లోపు ఏదో రకంగా ఈ సినిమాను వార్తలలో ఉంచాలని మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు కూడా వర్కవుట్ అవుతున్నాయి. వారి ప్రయత్నాలతో ఈ సినిమా ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సినిమాలోని ‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా తమ కలల్ని సాకారం చేసుకోవాలనేలా ఈ పాట ఎంతగానో స్ఫూర్తినిస్తుందని విజయ్ దేవరకొండ తెలిపారు. చిత్ర టీమ్‌కు విజయ్ దేవరకొండ తన బెస్ట్ విశెస్ అందించారు.
‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాట విషయానికి వస్తే.. కార్తీక్ రోడ్రిగ్స్ బ్యూటీఫుల్ ట్యూన్‌తో కంపోజ్ చేశారు. దర్శకుడు భాస్కర్ మౌర్య ముత్తయ్య పాత్రను రిఫ్లెక్ట్ చేసేలా సాహిత్యం అందించగా, చిన్నా కె. ఆకట్టుకునేలా ఈ పాటను ఆలపించారు. ‘సీనిమాల యాక్టు జేశి ఎలిగిపోతవా…బుట్టలల్లుకుంట ఊళ్ళె మిలిగిపోతవా ముత్తయ్య.., తిక్క తిక్క ఈడియోలు జేసుకుంటవా.. స్టెప్పులేసి ఎగిరి దుంకి సంపుతుంటవా ముత్తయ్య, పేమసైతవా పేళ్లు గోళ్లు గిల్తవా..’ అంటూ ముత్తయ్య వెండితెర కలను వర్ణిస్తూ సాగుతుందీ పాట. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Dragon: సముద్రపు ఒడ్డున డ్రాగన్‌తో దర్శకుడు.. పిక్ వైరల్
‘ముత్తయ్య’ స్టోరీ లైన్ విషయానికి వస్తే.. ఒక మారుమూల గ్రామంలో 70 ఏళ్ల వ్యక్తి చనిపోయే ముందు నటుడు కావాలని కలలు కంటాడు. తన డ్రీమ్‌ని తన ప్రాణ స్నేహితుడితో పంచుకుంటూ, సాధ్యమైన ప్రతిచోటా తన యాక్టింగ్ టాలెంట్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాడు. మరి అతని కల నెరవేరిందా? ఆ వయసులో ఆయనకు నటుడిగా అవకాశం వచ్చిందా? వంటి ప్రశ్నలకు హార్ట్ టచ్చింగ్‌తో కూడిన సమాధానాలే ఈ సినిమా. దర్శకుడు నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించడం, ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత. అందులోనూ ఈటీవీ విన్‌లో ఈ సినిమా వస్తుంది కాబట్టి.. ఇలాంటి సినిమాలకు అక్కడ మంచి ఆదరణే లభిస్తుందని యూనిట్ సైతం భావిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు