Raashi Khanna: బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. టాలీవుడ్‌లో ఆమెకు మంచి పేరే ఉంది. కొన్ని హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్సులు కూడా వచ్చాయి. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్నాళ్లుగా ఆమె గ్లామర్‌ను మాత్రమే నమ్ముకుంటుంది. అదీ సినిమాల్లో కాదు, సోషల్ మీడియాలో. రాశీ ఖన్నా ఇప్పటి వరకు సినిమాల్లో అందాలు ఆరబోసింది చాలా తక్కువే. చాలా వరకు పద్దతిగానే, పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలే చేస్తూ వచ్చింది. ఎక్స్‌పోజింగ్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పుకోవాలి. కానీ, ఆమెకు వచ్చిన అవకాశాలు, ఆమె చేసిన సినిమాలు దృష్టిలో పెట్టుకుంటే, టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలి. అమ్మడి అందం అలాంటిది. కానీ అది జరగలేదు.
Also Read- Dragon: సముద్రపు ఒడ్డున డ్రాగన్‌తో దర్శకుడు.. పిక్ వైరల్
దీనికి కారణం ఎవరనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందుకే, బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా చేస్తుందో, లేదంటే నా గ్లామర్ సత్తా ఇదని చూపిస్తుందో తెలియదు కానీ, బికినీ ట్రీట్‌కు కూడా వెనుకాడటం లేదు. అందాలను ఆరబోస్తూ, సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు చూసి ఆమె అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇదేంటి? నిజంగా రాశీ ఖన్నానేనా? మరీ ఇలా తయారైంది ఏంటి? అనేలా ఫ్యాన్సే కామెంట్స్ చేస్తున్నారంటే, ఆమె అంద ప్రదర్శన ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా రాశీ ఖన్నా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం, ఎంతగా బాలీవుడ్ కంట్లో పడాలని అనుకుంటే మాత్రం.. మరీ ఇంతలానా? ఆ ఎక్స్‌పోజింగ్ ఏంటి? ఆ బికినీ ఏంటి? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ గ్లామర్ డోస్‌కు ఇంక నిద్రపోయేది ఎలా? అంటూ ఆమె అందాలను ఆస్వాదిస్తున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకు వేసి.. గతంలో ఎక్స్‌పోజింగ్ విషయంలో నీతులు చెప్పి.. ఇప్పుడేంటి ఈ రచ్చ? అనేలా కూడా రాశీకి ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజంగా ఇలాంటి ఎక్స్‌పోజింగ్ చేయనందుకే ఆమెకు అవకాశాలు రాలేదనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఏది ఏమైతేనేం రాశీ ఖన్నా కూడా రంగంలోకి దిగేసింది అనేది మాత్రం ఈ ఫొటోలతో తెలిసిపోతుంది.
Also Read- Pravasthi Aaradhya: సింగర్ సునీత పై సంచలన ఆరోపణలు చేసిన ప్రవస్తి ఆరాధ్య
ఆమె షేర్ చేసిన ఫొటోలను గమనిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్విమ్ సూట్‌తో రాశీ ఖన్నా జలకాలాడుతున్నారు. రెడ్ బికినీలో హాట్ లుక్‌తో ఆమె చేసిన అందాల ప్రదర్శన వావ్ అనేలా ఉంది. ఈ ఫొటోలకు ‘తప్పిపోయాను, మళ్లీ దొరకకూడదని అనుకుంటున్నాను’ అని ఆమె పెట్టిన క్యాప్షన్ చూస్తుంటే, ఆమె ఎంతగా ఎంజాయ్ చేస్తుందో అర్థమవుతుంది. ఇక ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వావ్ వాటే బ్యూటీ, స్టన్నింగ్ లుక్స్ అంటూ నెటిజన్లు ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో సిద్దు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే సినిమాలో చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు