Anushka in Ghaati
ఎంటర్‌టైన్మెంట్

Ghaati: ఏప్రిల్ 18 రిలీజ్ అన్నారు.. ఇంకెప్పుడు? ఈ ప్రాజెక్ట్‌లో అయినా క్రిష్ ఉన్నాడా?

Ghaati: స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty) సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఆమె సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి 2’ (Bahubali 2)కి ముందు చేసిన ఒకే ఒక్క తప్పుతో చాలా కాలం సినిమాలకు స్వీటీ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ‘బాహుబలి 2’ చిత్రానికి కూడా ఆమె సైజ్‌ను మ్యానేజ్ చేయాల్సి వచ్చిందంటే, ‘సైజ్ జీరో’ (Size Zero) సినిమా చేసి ఆమె ఎంత తప్పిదం చేసిందో అర్థం చేసుకోవచ్చు. సరే.. ఆ సైజ్ కష్టాలను జయించి మళ్లీ నటిగా బిజీ అవుతుందని అనుకుంటే, కనీసం ఏడాదికి ఒక సినిమా కూడా అనుష్క నుంచి రావడం లేదు. ఎట్టకేలకు అనుష్కను ‘వేశ్య’గా చూపించిన క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటి’ అనే సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభమై, షూటింగ్ జరుగుతున్న విషయం కూడా చెప్పకుండా సైలెంట్‌గా అంతా చేస్తూ వచ్చారు. టీజర్ వదిలే వరకు ఈ సినిమా ఒకటి ఉందని, అక్కడ ఇక్కడా వార్తలు రావడమే కానీ, మేకర్స్ అధికారికంగా ప్రకటించింది లేదు.

Also Read- Vijayashanti: ‘అఖండ 2’లో.. రాములమ్మ సమాధానమిదే!

అయితే టీజర్ వచ్చి కూడా చాలా కాలం అవుతుంది. టీజర్ అనంతరం రిలీజ్ డేట్‌పై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అంటూ డిసెంబర్ నెలలో ఓ వీడియోను మేకర్స్ వదిలారు. ఆ వీడియోలో నిర్మాతలు వచ్చి క్రిష్‌ని కలుస్తారు. ఫస్ట్ కాపీ ఎప్పుడిస్తున్నావ్ అంటే.. నాకు కొంచెం టైమ్ కావాలి. ఇంకా మూడు నెలలు పడుతుందని క్రిష్ సమాధానం ఇచ్చారు. మూడు కాదు నాలుగు నెలలు తీసుకో.. కానీ చెప్పిన టైమ్‌కి ఇవ్వాలని అడగగానే, క్రిష్ నవ్వుతూ.. అదేంటి? మీరు రిలీజ్ డేట్ ఏమైనా ఫిక్స్ అయ్యారా? అని అడగగానే, స్వీటీ అనుష్క ప్రత్యక్షమై, ఏప్రిల్ 18 (Ghaati Release Date) అని ప్రకటించింది. ఈ వీడియో వచ్చి దాదాపు నాలుగు నెలలు అయింది. ఆ వీడియోలో అనుష్క చెప్పిన డేట్ కూడా వెళ్లిపోయింది. ఇంత వరకు కనీసం మేకర్స్ వాయిదా వేస్తున్నామనే అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాపై రకరకాలుగా వార్తలు మొదలయ్యాయి.

మెయిన్‌గా ఈ సినిమా నుంచి కూడా క్రిష్ తప్పుకున్నాడా? అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు మొదలయ్యాయి. అలా అనడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే క్రిష్ రెండు ప్రాజెక్ట్‌ల నుంచి అలా మధ్యలో తప్పుకున్నాడు. అందులో ఒకటి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన ‘మణికర్ణిక’ (Manikarnika) కాగా, రెండోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ‘మణికర్ణిక’ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ మధ్యలో వచ్చేస్తే.. బ్యాలెన్స్ షూట్‌ను స్వయంగా కంగానానే డైరెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ‘హరి హర వీరమల్లు’ గురించి చెప్పేదేముంది. ఆ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో, ఎప్పుడు షూటింగ్ ఉంటుందో చెప్పలేని విధంగా మారింది. దీంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడా చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఆ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

Also Read- Samantha: విడాకులకు కారణం అదేనా? చైతూ చేసిన తప్పు ఇదేనా?

మరి స్వీటీ ‘ఘాటి’ సంగతేంటనేది మాత్రం మేకర్స్ ప్రకటిస్తేగానీ తెలియదు. అసలీ ప్రాజెక్ట్‌లో క్రిష్ ఉన్నాడా? దీని నుంచి కూడా తప్పుకున్నాడా?. ఎందుకంటే, ఏప్రిల్ 18న రిలీజ్ అని డేట్ అనౌన్స్‌మెంట్ చేసే టైమ్‌కే చాలా వరకు షూట్ పూర్తయింది. ఆ అప్డేట్ తర్వాత మళ్లీ ఇంత వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ప్రమోషన్స్ లేవు. ప్రమోషన్స్ సంగతి పక్కన పెడితే.. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నవారే లేరు. అసలీ ప్రాజెక్ట్ ఉందా? లేదంటే ఎన్నో సినిమాల మాదిరిగా ఇది కూడా అటకెక్కినట్టేనా? ఒక వేళ ఉంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే ప్రశ్నలకు మేకర్స్ నుంచి సమాధానం ఎప్పుడు వస్తుందో.. వెయిట్ అండ్ సీ.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు