Vijayashanti: లేడీ సూపర్ స్టార్, రాములమ్మ విజయశాంతి నటిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్‌ని ఇండస్ట్రీకి ఇచ్చారు. హీరోలతో కాంబినేషన్స్, లేడీ ఓరియంటెడ్ సినిమాలు.. ఇలా అన్ని తరహా పాత్రలు చేసి ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ప్రస్తుతం పాలిటిక్స్ పరంగా బిజీగా ఉన్న రాములమ్మ (Ramulamma), ఇటీవల మహేష్ బాబు (Mahesh Babu), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru)తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయనని చెప్పిన రాములమ్మ, నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా రూపొందిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ఆమె చేయడానికి కారణం ఇప్పటికే ఆమె చెప్పి ఉన్నారు. తన ‘కర్తవ్యం’ సినిమా పాత్రకు బాబు పుడితే, అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అందుకే విజయశాంతి ఈ సినిమాలో చేయడానికి ఓకే చెప్పారు.
Also Read- Allu Arjun: మరో వివాదంలో అల్లు అర్జున్, అసలు అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?
అలా అనీ, ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ లేదని కాదు, సినిమా ఎక్కువ భాగం ఆధారపడేదే వైజయంతి పాత్రపై. ‘కర్తవ్యం’ నాటి విజయశాంతిని తలపించేలా ఇందులో ఆమెకు అన్ని రకాల సీన్లు యాడ్ చేశారు. సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని రకాలుగా తనకు నచ్చడంతోనే రాములమ్మ ఈ సినిమాకు ఓకే చెప్పారు. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంటున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. దాదాపు బ్రేకీవెన్ అయినట్లుగా కూడా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాములమ్మ తన సంతోషాన్ని తెలియజేయడానికి మీడియాతో ముచ్చటించారు. ఈ సమావేశంలో ఆమె అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ‘అఖండ 2’లో రాములమ్మ నటిస్తుందనే వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు.
‘అఖండ 2’ (Akhanda 2) సినిమాలో మీరు నటిస్తున్నారంట కదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ నవ్వేశారు. ‘నిజంగా ఈ విషయం నాకు తెలియదండి. మీరు అడుగుతుంటేనే తెలుస్తుంది’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఆమె ‘అఖండ 2’లో యాక్ట్ చేయడం లేదనేది తెలిసిపోయింది. అయినా ఎక్కడా టీమ్ కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. కావాలని కొందరు పుట్టించిన రూమర్ ఇది. గతంలో బాలయ్య (Balakrishna)తో విజయశాంతి చాలా సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఆమె మళ్లీ నటిస్తుండటంతో, ఎవరో ఒక రాయి అలా విసిరారు. అంతే తప్ప, ‘అఖండ 2’లో రాములమ్మ నటిస్తుందనే వార్తలలో అస్సలు నిజం లేదు. ఆ విషయం ఆమె క్లారిటీగా చెప్పారు.
Also Read- Rambha: నా రక్తంలోనే ఉంది.. 30 ఏళ్ల క్రితం మ్యాజిక్ మరోసారి రిపీట్!
ఇక ఈ మధ్య రివ్యూయర్స్‌పై సీరియస్ అవడానికి కారణం చెబుతూ.. ‘‘నేను నటించకపోయినప్పటికీ, ఇలాంటి విషయాలు నా దగ్గరకు వస్తూనే ఉంటాయి. థియేటర్లలో చక్కగా ఆడుతున్న సినిమాలను కూడా కిల్ చేస్తుండటం కొన్నాళ్లుగా గమనిస్తున్నాను. అందుకే అలా స్పందించాను. ఇక్కడ అందరం ఇండస్ట్రీ మీద బతుకుతున్నామనే విషయాన్ని మరిచిపోకూడదు. అప్పుడు చాలా బాధ్యతగా వుండాలి. బాగున్న సినిమాలపై అలా క్రిటిసిజం చేయడం కరెక్ట్ కాదు. మీకు నిజంగా సినిమా నచ్చకపోతే సజెషన్స్ ఇవ్వవచ్చు. మీ దగ్గర కథలుంటే చెప్పండి. కానీ బాగున్న సినిమాపై విమర్శ చేయడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదనిపించే ఆరోజు అలా రియాక్ట్ అయ్యాను’’ అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు